ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mahabubnagar: కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్సీ చల్లా?

ABN, Publish Date - Jul 09 , 2024 | 03:56 AM

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫిరాయింపులతో కుదేలవుతున్న బీఆర్‌ఎ్‌సకు మరో షాక్‌ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఆయన అనుచరుడైన అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు..

  • సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన మండలి సభ్యుడు

  • జిల్లా సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం

  • అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడూ హస్తం గూటికే?

  • ఇద్దరూ కలిసి పార్టీలో చేరతారని ప్రచారం

  • అదే జరిగితే పాలమూరులో బీఆర్‌ఎస్‌ ఖాళీ

  • జిల్లా సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం

  • ఎమ్మెల్యేతో కలిసి హస్తం గూటికి చేరతారని ప్రచారం

మహబూబ్‌నగర్‌/హైదరాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫిరాయింపులతో కుదేలవుతున్న బీఆర్‌ఎ్‌సకు మరో షాక్‌ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఆయన అనుచరుడైన అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు.. గులాబీకి గుడ్‌బై చెప్పి కాంగ్రె్‌సలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సోమవారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలవడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా సమస్యలను పరిష్కరించాలని, రాయచూర్‌ నుంచి శ్రీశైలం వరకు రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయాలని, ఆర్డీఎస్‌ కింద రిజర్వాయర్లు, నెట్టెంపాడు ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని కోరుతూ ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ను వెంకట్రామిరెడ్డి కోరారు. అయితే పైకి ఈ విషయం చెబుతున్నా.. కాంగ్రె్‌సలో చేరికపై చర్చించేందుకే సీఎంను కలిశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, వెంకట్రామిరెడ్డి పార్టీ మారితే అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు కూడా ఆయన వెంట నడవడం ఖాయమవుతుంది.


ఇదే జరిగితే.. సీఎం రేవంత్‌ సొంత జిల్లాలో కాంగ్రెస్‌ క్లీన్‌స్వీ్‌ప చేసినట్లవుతుంది. గతంలో అలంపూర్‌ నియోజకవర్గం జనరల్‌గా ఉన్న సమయంలో వెంకట్రామిరెడ్డి అక్కడినుంచి కాంగ్రెస్‌ తరఫున ఓసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏడాదిన్నర క్రితం బీఆర్‌ఎ్‌సలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023 ఎన్నికల్లో తన అనుచరుడైన విజయుడుకి టికెట్‌ ఇప్పించుకొని గెలిపించుకున్నారు. ఆ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 14 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ 12 చోట్ల గెలుపొందగా.. గద్వాల, అలంపూర్‌ స్థానాలను మాత్రమే బీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. అయితే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఇప్పటికే కాంగ్రె్‌సలో చేరడంతో ఎమ్మెల్సీ చల్లా, ఎమ్మెల్యే విజయుడు కూడా హస్తం గూటికి చేరతారనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని వీరిద్దరు ఇప్పటిదాకా ఖండించలేదు. కానీ, అలంపూర్‌కే చెందిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ వీరి చేరికకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. చల్లా చేరికతో నియోజకవర్గంలో పట్టు కోల్పోతాననే భావనలో సంపత్‌ ఉన్నట్లు, అయితే పార్టీ పదవుల్లో సముచితం స్థానం కల్పిస్తామంటూ ఆయనను నాయకత్వం బుజ్జగిస్తున్నట్లు సమాచారం.

Updated Date - Jul 09 , 2024 | 03:56 AM

Advertising
Advertising
<