మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MLC Kavitha: కవితకు బెయిల్ వస్తుందా?

ABN, Publish Date - Apr 23 , 2024 | 07:32 AM

ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ కేసుల్లో ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన ట్రయల్ కోర్టు. నేడు వర్చువల్ గా కవితను అధికారులు జడ్జి ముందు హాజరుపరచనున్నారు. మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని ట్రయల్ కోర్టు ముందు దర్యాప్తు సంస్థలు విజ్ఞప్తి చేయనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించనునున్నారు.

MLC Kavitha: కవితకు బెయిల్ వస్తుందా?

ఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. అయితే కవిత కేసులో ఇవాళ కీలకం కానుంది. బెయిల్ లభిస్తుందా? లేదా? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ కేసుల్లో ఈనెల 23 వరకూ ట్రయల్ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. నేడు వర్చువల్ గా కవితను అధికారులు జడ్జి ముందు హాజరుపరచనున్నారు. మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని ట్రయల్ కోర్టు ముందు దర్యాప్తు సంస్థలు విజ్ఞప్తి చేయనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించనునున్నారు. సీబీఐ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై మే 2 వ తేదీ కావేరి భవేజ ధర్మాసనం తీర్పును వెలువరించనుంది.

మోదీకి ఓటమి భయం


ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కల్వకుంట్ల కవితది కీలక పాత్ర అని రౌస్‌ అవెన్యూ కోర్టులో సీబీఐ బలమైన వాదనలను వినిపించింది. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని కాబట్టి బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ తెలిపింది. ఈ పిటిషన్లపై ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భవేజా సోమవారం వేర్వేరుగా విచారణ చేపట్టారు. ఈ విచారణ సందర్భంగా కవితకు బెయిల్ మంజూరు చేయవద్దంటూ సీబీఐ వాదించింది. సీబీఐ తరఫున పంకజ్‌గుప్తా, కవిత తరఫున విక్రమ్‌ చౌదరి వాదనలను వినిపించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

నా గెలుపు ఖాయం

మోదీకి ఓటమి భయం

భార్య పుట్టినరోజు జరిగిన రెండో రోజే.. ఘోర రోడ్డు ప్రమాదం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 23 , 2024 | 08:29 AM

Advertising
Advertising