Admissions: మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు జనవరి 6 నుంచి దరఖాస్తులు
ABN, Publish Date - Dec 21 , 2024 | 04:40 AM
మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం జనవరి 6వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
హైదరాబాద్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం జనవరి 6వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 13న నిర్వహించనున్నారు. అభ్యర్థుల హాల్‌టికెట్లను ఏప్రిల్ 3 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. 6వ తరగతిలో అడ్మిషన్ల కోసం ఏప్రిల్ 13న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, 7 నుంచి 10 తరగతుల్లోని ఖాళీ సీట్లలో అడ్మిషన్ల కోసం అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.
Updated Date - Dec 21 , 2024 | 04:40 AM