MP Eatala: ఏం బాధపడకండి.. ఆ రోడ్డు తెరిపించే బాధ్యత నాదే..
ABN, Publish Date - Oct 08 , 2024 | 12:55 PM
విజయవాడ జాతీయ రహదారిపైన ఉన్న ట్రాఫిక్‌ను అదిగమించేందుకు పోచంపల్లి- మన్సూరాబాద్(Pochampally- Mansoorabad) వరకు ఉన్న పాత రోడ్డు తెరిపించే బాధ్యత నాదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajigiri MP Etala Rajender) అన్నారు.
- మన్సూరాబాద్ -పోచంపల్లి రోడ్డు తప్పక తెరిపిస్తా..
- ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్: విజయవాడ జాతీయ రహదారిపైన ఉన్న ట్రాఫిక్‌ను అదిగమించేందుకు పోచంపల్లి- మన్సూరాబాద్(Pochampally- Mansoorabad) వరకు ఉన్న పాత రోడ్డు తెరిపించే బాధ్యత నాదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajigiri MP Etala Rajender) అన్నారు. ఆయన మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డితో కలిసి క్రీడా అధికారులు శ్రీ సాయినగర్‌కాలనీ వద్ద మూసివేసిన రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గతంలో ఉన్న పాత రోడ్డు మ్యాపును ఈటలకు చూపించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మెరిట్‌కూ దక్కలేదు! డీఎస్సీలో క్వాలిఫైడ్ అభ్యర్థులకు నిరాశ
రోడ్డును మూసి వేయడం వల్ల కలుగుతున్న ఇబ్బందులను, ట్రాఫిక్ సమస్యలను ఎంపీకి వివరించారు. దాదాపు వంద సంవత్సరాలుగా ఉన్న రోడ్డును కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ (క్రిడా) ఏర్పాటుతో అధికారులు రోడ్డుకు అడ్డంగా గోడను కట్టి మూసివేశారని తెలిపారు. ప్రజలకు కలుగుతున్న అసౌకర్యంపై దాదాపు 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని నర్సింహారెడ్డి ఎంపీకి వివరించారు. అయినా అధికారులు స్పందించడం లేదని అన్నారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. నగరానికి దూరాన్ని తగ్గించేదిగా ఉన్న మన్సూరాబాద్- పోచంపల్లి రోడ్డును కేంద్ర ప్రభుత్వంతో చర్చించి తెరిపించడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని అన్నా రు. ఈ రోడ్డును తెరిపించడం వల్ల విజయవాడ జాతీయ రహదారిపైన ట్రాఫిక్ తగ్గుతుందన్నారు. ఫోన్‌లో ఫారెస్టు అధికారులతో మాట్లాడారు. పాత రోడ్డును వదిలి రోడ్డుకు ఇరువైపుల గోడ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, మాజీ కౌన్సిలర్ రవీందర్‌రెడ్డితో పాటు పలువురు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
అభివృద్ధి వైపు అడుగులు వేయాలి..
దిల్‌సుఖ్‌నగర్: కాలనీవాసులంతా ఐక్యమత్యంతో సమస్యలపై పోరాటం చేసినప్పుడే కాలనీలు త్వరగా అభివృద్ధి చెందుతాయని ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని పీ అండ్ టీ కాలనీ కమ్యూనిటీహాల్‌లో ఆ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కాలనీ 50 ఏళ్ల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ చెరువు లోతట్టున ఉన్నటువంటి పీ అండ్ టీ కాలనీ తరచు ఇబ్బందులు పడుతున్న వరదనీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక చొరవచూపుతానని హామీనిచ్చారు.
రాజ్యసభసభ్యుడు అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ అన్ని ప్రాంతాల ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారుల కలయికతో ఏర్పడిన పీ అండ్ టీ కాలనీ యాభై వసంతాల వేడుక జరుపుకోవడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఐఎఫ్ఎస్ అధికారి సుభద్రదేవి, గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ బండి నిర్మల, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మున్నంగి అశోక్ కుమార్, వేణుగోపాల్, మున్నాయాదవ్ పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: Harish Rao: జర్నలిస్టులకు సర్కారు దసరా కానుక ఇదేనా?
ఇదికూడా చదవండి: Hyderabad: త్వరలో టీడీపీలోకి తీగల
ఇదికూడా చదవండి: Police Department: అవినీతి ఐపీఎస్‌లపై కొరడా!
ఇదికూడా చదవండి: Gold Prices Today: గుడ్ న్యూస్.. దిగొచ్చిన పసిడి ధరలు..
Read Latest Telangana News and National News
Updated Date - Oct 08 , 2024 | 01:04 PM