ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MP Eatala: రైల్వే ఓవర్‌ బ్రిడ్జి ఏర్పాటుకు కృషి చేస్తా..

ABN, Publish Date - Jul 12 , 2024 | 10:36 AM

మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలోని ప్రాంత ప్రజలను రైల్వేచక్రబంధం నుంచి విముక్తి కలిగించడానికి శాయశక్తుల కృషి చేస్తానని ఎంపీ ఈటల రాజేందర్‌(MP Etala Rajender) అన్నారు. ఆయన మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలను సందర్శించారు.

హైదరాబాద్: మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలోని ప్రాంత ప్రజలను రైల్వేచక్రబంధం నుంచి విముక్తి కలిగించడానికి శాయశక్తుల కృషి చేస్తానని ఎంపీ ఈటల రాజేందర్‌(MP Etala Rajender) అన్నారు. ఆయన మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా అల్వాల్‌ ఎంఎంటీఎస్‌ రైల్వేస్టేషన్‌ సాధన కమిటీ సభ్యులు కిష్టమ్మ ఎన్‌క్లేవ్‌ రైల్వే క్రాసింగ్‌ వద్ద రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌ ఏర్పాటు చేయాలని ఈటలకు వినతిపత్రం అందించారు. వెంటనే సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని ఆయన స్ధానికులకు హామీ ఇచ్చారు. దాంతో పాటు అల్వాల్‌ లయోలా వద్ద ఎంఎంటీఎస్‌ రైల్వే స్టేషన్‌(MMTS Railway Station) ఏర్పాటు చేయాలని, భూదేవినగర్‌ రైల్వేస్టేషన్‌ బదులుగా వెంకటాపురం రైల్వేస్టేషన్‌గా పేరు మార్చాలని బీజీపీ మాజీ కౌన్సిలర్‌ నిమ్మ కృష్ణారెడ్డి ఎంపీని కలిసి వినతిపత్రం అందించారు. ఎంపీ ఈటల సైతం సానుకూలంగా స్పదించి పనులు జరిగేవిధంగా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఎంటీఎస్‌ రైల్వేస్టేషన్‌ లయోలాకాలేజ్‌ అల్వాల్‌ సాధన కమిటీ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, సభ్యులు శ్రీనివాస్‏రెడ్డి, రిటైర్డ్‌ రైల్వే అధికారులు నూర్‌ అహ్మాద్‌అలీ పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ స్మగ్లర్‌ అరెస్ట్‌..


కేంద్ర రైల్వేశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లా..

బొల్లారం రైల్వే గేట్‌ వద్ద తక్షణమే ఆర్‌వోబీ (రైల్వే ఓవర్‌ బ్రిడ్జి) నిర్మాణం అత్యంత ఆవశ్యకమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని రైల్వే గేట్‌ల వద్ద ఆర్‌యుబీ, ఆర్‌వోబీ నిర్మాణాల ఆవశ్యకత గురించి ఇదివరకే కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లానని ఆయన తెలిపారు. వీటిపై కేంద్ర రైల్వే శాఖా మంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు. కేంద్రమంత్రి సూచనమేరకు గురువారం ఎంపీ ఈటల రాజేందర్‌ మల్కాజిగిరి నియోజకవర్గంలోని రైల్వే గేట్‌లన్నింటిని స్థానిక ప్రజలు, రైల్వే అధికారులతో కలిసి సమీక్షించారు. అనంతరం సెలెక్ట్‌ టాకీస్‌ జనప్రియ వద్ద గల రైల్వే అండర్‌ బ్రిడ్జిని ఈటల రాజేందర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, రైల్వే అధికారులు, స్థానిక బీజేపీ నాయకులు మాణిక్యరెడ్డి, దండుగుల వెంకటేష్‌, మల్లికార్జున్‌యాదవ్‌, మహిపాల్‌రెడ్డి, అజయ్‌రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్లొన్నారు.

ఇదికూడా చదవండి: నాంపల్లి కాల్పుల ఘటనపై కీలక అప్డేట్


పార్కు స్థలాన్ని కాపాడాలని వినతి

మచ్చబొల్లారం డివిజన్‌ శ్రీ సాయి సూర్య ఎన్‌క్లేవ్‌లో ఉన్న పార్కు స్థలాన్ని కొందరు కబ్జా చేయాలని చూస్తున్నారని, కాపాడాలని కోరుతూ గురువారం ఎంపీ ఈటల రాజేందర్‌కు స్థానిక బీజేపీ నాయకుడు రాజిరెడ్డి వినతిపత్రం అందజేశారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 12 , 2024 | 10:36 AM

Advertising
Advertising
<