MP Eatala: సచివాలయాన్ని బఫర్ జోన్‌లో కట్టలేదా..
ABN, Publish Date - Oct 25 , 2024 | 07:40 AM
సచివాలయం బఫర్ జోన్‌లో కట్టలేదా.. అంటూ ఎంపీ ఈటల రాజేందర్(MP Etala Rajender) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం సాయంత్రం అత్తాపూర్ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.
- అత్తాపూర్ మూసీ పరివాహక పాంతాల్లో పర్యటించిన ఎంపీ ఈటల
హైదరాబాద్ సిటీ: సచివాలయం బఫర్ జోన్‌లో కట్టలేదా.. అంటూ ఎంపీ ఈటల రాజేందర్(MP Etala Rajender) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం సాయంత్రం అత్తాపూర్ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జలవిహార్, ఐమాక్స్, సచివాలయం బఫర్ జోన్‌లో కట్టలేదా.. నీకో న్యాయం, ప్రజలకో న్యాయమా అని ప్రశ్నించారు. మూసీని శుభ్రం చేయాలని, పేదల భూములను మాత్రం లాక్కోవద్దని అన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Medak: రాష్ట్రంలో 5 క్యాన్సర్ చికిత్స కేంద్రాల ఏర్పాటు
మూసీ పునరుజ్జీవానికి ఇళ్లు కూల్చడం దేనికి అని ప్రశ్నించారు. డీపీఆర్(DPR) లేకుండా, మార్కింగ్ ఎట్లా చేస్తారని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, అందులో విష రసాయనాలు, మురుగునీరు కలుస్తోందని, వాటిని అరికట్టాలని హితవు పలికారు. గత ముఖ్యమంత్రి హుస్సేన్‌సాగర్(Hussainsagar)ను ఎందుకు బాగు చేయలేదని ఈటల ప్రశ్నించారు. మూసీ, చెరువల పక్కన ఉన్నవాళ్లకు నాలుగు నెలలుగా కంటిమీద కునుకులేకుండా పోయిందన్నారు.
చెరువులు, మూసీ పక్కన ఉన్నవి అన్నీ ప్రభుత్వ భూములు కావని, పట్టా భూములు కూడా ఉన్నాయని, కొంతమంది బ్యాంక్ రుణాలు తీసుకొని ఇళ్లు కట్టుకున్నారని అన్నారు. స్థానికులు తమ సమస్యలను ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. తాము పట్టా భూములు కొనుకున్నామని, ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసి ఇప్పుడు అక్రమం అంటే తప్పు ఎవరిదని స్థానికులు ప్రశ్నించారు.
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: ఉద్యోగులకు రెండు డీఏలు!
ఈవార్తను కూడా చదవండి: KTR: ఒకటి, రెండేళ్లు జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే
ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలోనే సొంతంగా సీడ్ గార్డెన్: తుమ్మల
ఈవార్తను కూడా చదవండి: నేడు సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్
Read Latest Telangana News and National News
Updated Date - Oct 25 , 2024 | 07:40 AM