MP Etala: నోడౌట్.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎగిరేది కాషాయ జెండానే
ABN, Publish Date - Nov 23 , 2024 | 10:13 AM
రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఎగిరేది కాషాయ జెండానే అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Etala Rajender) ధీమా వ్యక్తం చేశారు. మల్కాజిగిరిలోని పద్మావతి ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సభ్యత్వ నమోదు వర్క్‌షాపు నిర్వహించారు.
- ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్: రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఎగిరేది కాషాయ జెండానే అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Etala Rajender) ధీమా వ్యక్తం చేశారు. మల్కాజిగిరిలోని పద్మావతి ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సభ్యత్వ నమోదు వర్క్‌షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు గెలువాలంటే బూతుకమిటీలు పటిష్టంగా ఉండాలని, పార్టీ మీద కమిట్మెంట్, ప్రజలతో సంబంధాలు, పనిచేసే గుణం, సమర్థత ఉన్నవారికే బూతు కమిటీ బాధ్యతలు ఇవ్వాలని అన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మేడిపల్లిలో అర్యన్‌రెడ్డి అంతక్రియలు..
పాతనాయకులు, సీనియర్లకు సముచిత స్థానం కల్పించాలన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం(Congress, BRS, MIM)తో పొత్తు ఉండదంటూ ఎంపీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తల్లోజు ఆచారి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, జనార్ధన్‌రెడ్డి, జిల్లా కన్వినర్ మల్లారెడ్డి, గిరివర్ధన్‌రెడ్డి, మీసాల చంద్రయ్య, భానుప్రకాష్, సూర్యారావు, వీకే మహేష్, వాసంశెట్టి శ్రీనివాస్, నరహరి తేజ, బాలచందర్‌గౌడ్ పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
ఈవార్తను కూడా చదవండి: Sarpanch: కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: AV Ranganath: కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తుంది!
ఈవార్తను కూడా చదవండి: వామ్మో...చలి
Read Latest Telangana News and National News
Updated Date - Nov 23 , 2024 | 10:13 AM