ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Loksabha polls: అర్ధరాత్రి వచ్చి డబ్బులిస్తారు.. డబ్బు తీసుకోండి కానీ ఓటు మాత్రం..: రేణుకా చౌదరి

ABN, Publish Date - May 09 , 2024 | 10:54 AM

Telangana: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సాయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆదిలక్ష్మి కోల్డ్ స్టోరేజ్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘మీరంతా ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి. అది ఒక వ్యక్తి కోసం కాదు కాంగ్రెస్ విధానాలకు వేయండి. ఎంతమంది తిరుగుతుంటారు’’..

Congress MP Renuka Chowdary

ఖమ్మం, మే 8: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసాయం రఘురాంరెడ్డి (congress mp candidate Ramasahayam Raghuramireddy) విజయాన్ని కాంక్షిస్తూ ఆదిలక్ష్మి కోల్డ్ స్టోరేజ్‌లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి (Congress MP Renuka Chowdary) ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘మీరంతా ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి. అది ఒక వ్యక్తి కోసం కాదు కాంగ్రెస్ విధానాలకు వేయండి. ఎంతమంది తిరుగుతుంటారు.. వాళ్ళను పక్కకు పెట్టి ఇండియా కూటమికి ఓటు వేసి బీజేపీని గద్దె దింపాలి. మంచి వ్యక్తి చదువుకున్న వ్యక్తి, సౌమ్యుడు రఘురాం రెడ్డి ఆయనకు అవకాశం ఇవ్వండి. మంచి వ్యక్తిని కాపడుకుంటేనే మన ధర్మం. బీజేపీ (BJP) దరిద్రం మనం తొలగించుకోవాలి. మణిపూర్‌లో బీజేపీ చేసిన ఆకృత్యాలు మనం వదిలించుకోవాలి. మన ఆడపిల్లలను వీళ్ళ నుండి రక్షించుకోవాలి’’ అని ఎంపీ అన్నారు.

Lok Sabha Polls: యూపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్.. మాయవతి, అఖిలేష్ మధ్య మాటల యుద్ధం..


55 సంవత్సరాలు కాంగ్రెస్(Congress) అధికారంలో ఉందని తెలిపారు. రాహుల్ గాంధీ వంటి నాయకుడి గురించి వెక్కిలిగా ప్రధాని మాట్లాడారని మండిపడ్డారు. పిల్లలను చదివిపిస్తే వాళ్లకు ఉద్యోగాలు లేవన్నారు. నరేంద్ర మోదీ రైతాంగ ఆదాయం మూడు రెట్లు పెంచుతానని చెప్పి పెంచలేదన్నారు. ‘‘అర్థరాత్రి వేళ వస్తారు చేతిలో డబ్బు పెట్టి ఓటు వేయమని అడుగుతారు, డబ్బు తీసుకోండి ఓటు మాత్రం వాళ్లకు వేయకండి. హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. ఇచ్చేది వెయ్యి రూపాయలు.. ఐదు సంవత్సరాలకు వెయి రూపాయలతో మీ జీవితాన్ని వాళ్ళ చేతిలో పెడతారా?. మీ అమూల్యమైన ఓటు, అద్భుతమైన ఆయుధం కాంగ్రెస్‌పై వేసి రఘురాం రెడ్డిని గెలిపించండి’’ అని రేణుకా చౌదరి కోరారు.


ఈ ఆత్మీయ సమావేశానికి మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరితో పాటు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి, తుమ్మల యుగంధర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పొంగులేటి ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు గల్లంతు చేయాలని అఖిలపక్ష పార్టీలు కోరాయి.


ఇవి కూడా చదవండి...

Hyderabad: మాధవీలతకు శివసేన మద్దతు..

AP Election 2024: ఆ 48 గంటలు కీలకం అప్రమత్తంగా ఉండండి

Read latest Telangana News And Telugu News

Updated Date - May 09 , 2024 | 11:05 AM

Advertising
Advertising