ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nagarjuna Sagar: సగానికి పైగా నిండిన సాగర్‌..

ABN, Publish Date - Aug 01 , 2024 | 04:57 AM

కృష్ణమ్మ ఉధృతికి నాగార్జున సాగర్‌లో నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన శ్రీశైలం నుంచి 8 గేట్ల ద్వారా 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు సగానికి పైగా నిండింది.

  • 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

  • గోదావరిలో బ్యారేజీలకే భారీగా వరద

  • భద్రాచలం వద్ద 44.9 అడుగుల ఎత్తులో ప్రవాహం

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌: కృష్ణమ్మ ఉధృతికి నాగార్జున సాగర్‌లో నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన శ్రీశైలం నుంచి 8 గేట్ల ద్వారా 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు సగానికి పైగా నిండింది. 312.05 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తు తం 161.97 టీఎంసీల నీరు ఉంది. కృష్ణాబేసిన్‌లో సాగర్‌ దిగువన ఉన్న పులిచింతల మినహా మిగిలిన ప్రాజెక్టులన్నీ దాదాపు గా నిండాయి. గోదావరి బేసిన్‌లో సాగునీటిని అందించే కీలక ప్రాజెక్టు ల్లో తప్పిస్తే.. మిగతా ప్రాజెక్టుల్లో వచ్చిన నీటిని వచ్చినట్లు గానే విడుదల చేస్తున్నారు.


భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పం గా తగ్గుతోంది. బుధవారం సాయంత్రం 44.9 అడుగుల నీటి మట్టం నమోదైంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాగా, గురువారం ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించ నున్నారు. ఈ సందర్భంగా కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్నారు.

Updated Date - Aug 01 , 2024 | 04:57 AM

Advertising
Advertising
<