TS News: ఈసారి ప్రజలు అలా డిసైడ్ అయిపోయారు: బీజేపీ
ABN, Publish Date - May 20 , 2024 | 04:06 PM
Telangana: మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలని ప్రజలు భావిస్తున్నారని బీజేపీ నేతలు ఈటల రాజేందర్, బీబీ పాటిల్ అన్నారు. కోదాడలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో వీరు పాల్గొని ప్రసంగించారు. నల్గొండలో బీజేపీకి డిపాజిట్ రాదు అనేది అవగాహన లేనివారు అహంకారంతో మాట్లాడేవని అన్నారు. ఎన్ని డబ్బులు పెట్టినా ధర్మం న్యాయం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
సూర్యాపేట, మే 20: మోదీ (PM Modi) ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలని ప్రజలు భావిస్తున్నారని బీజేపీ నేతలు ఈటల రాజేందర్ (Etela Rajender), బీబీ పాటిల్ (BB Patil) అన్నారు. కోదాడలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల (Graduate MLC Elections) సమావేశంలో వీరు పాల్గొని ప్రసంగించారు. నల్గొండలో బీజేపీకి (BJP) డిపాజిట్ రాదు అనేది అవగాహన లేనివారు అహంకారంతో మాట్లాడేవని అన్నారు. ఎన్ని డబ్బులు పెట్టినా ధర్మం న్యాయం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ 12 సీట్లు గెలుస్తుందని అమిత్ షా మాట్లాడారని… అదే నిజం కాబోతోందని అన్నారు.
AP Election 2024: సస్పెండ్ అయిన అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగులు
‘‘మొన్ననే నీకు ఓటు వేసి మోసపోయినం ఈసారి బీజేపీకి ఓటువేస్తాం అని ప్రజలు డిసైడ్ అయ్యారు. ఇక్కడ ఉన్న మంత్రి బీజేపీకి డిపాజిట్ రాదు అని చెప్తున్నారట. మీ కుర్చీ కిందకు నీళ్ళు వచ్చాక తెలుస్తుంది.. బీజేపీ ఏంటి అనేది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. అమెరికా సేనేటర్లు జై మోదీ అని నినాదం చేసే స్థాయికి భారత దేశం ఔన్నత్యం పెంచారన్నారు. ఈ పదేళ్లలో నేషనల్ హైవేలు డబుల్ చేసిన ఘనత మోదీది అంటూ ఈటల రాజేందర్, బీబీ పాటిల్ కొనియాడారు.
ఇవి కూడా చదవండి...
Mileage Tips: పెట్రోల్, డీజిల్ ఎంత పోయించుకుంటే బెటర్.. ఫుల్ ట్యాంక్ లేదా లీటర్
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 20 , 2024 | 04:14 PM