ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana: బీఆర్ఎస్‌కు మరోషాక్ తప్పదా? కీలక నేత పార్టీని వీడనున్నారా?

ABN, Publish Date - Mar 10 , 2024 | 05:17 PM

Nalgonda News: మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత బలమైన, శక్తివంతమైన పార్టీగా వెలుగొందిన బీఆర్ఎస్ పార్టీ(BRS) పరిస్థితి ఇప్పుడు అత్యంత ధీనంగా మారిపోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) ఓటమి తరువాత ఆ పార్టీలోని ముఖ్య నేతలంతా పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సిట్టింగ్ ఎంపీలు, కీలక నేతలు పార్టీని వీడగా.. మిగిలిన నేతలు సైతం బీఆర్ఎస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..

BRS vs Congress

నల్లగొండ, మార్చి 10: మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత బలమైన, శక్తివంతమైన పార్టీగా వెలుగొందిన బీఆర్ఎస్ పార్టీ(BRS) పరిస్థితి ఇప్పుడు అత్యంత ధీనంగా మారిపోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections) ఓటమి తరువాత ఆ పార్టీలోని ముఖ్య నేతలంతా పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సిట్టింగ్ ఎంపీలు, కీలక నేతలు పార్టీని వీడగా.. మిగిలిన నేతలు సైతం బీఆర్ఎస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నల్గొండ(Nalgonda) జిల్లాకు చెందిన కీలక నేత ఒకరు కాంగ్రెస్‌(Congress) పార్టీలో చేరబోతున్నారట. ఆయనతో పాటు.. ఆయన తనయుడు సైతం హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారట. ఈ వార్త ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరి ఇంతకీ బీఆర్ఎస్ పార్టీని వీడనున్న నేత ఎవరు? ఇందులో నిజమెంత? ఆ నేత ఏం చెబుతున్నారు? ఈ కథనంలో తెలుసుకుందాం..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం శాసనమండలి చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందే గుత్తా సుఖేందర్ రెడ్డి తన తనయుడితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. అంతేకాదు.. తన అనుచరులందరినీ ఆయనే కాంగ్రెస్‌లోకి పంపించారనే టాక్ కూడా నడిచింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోవడం.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన తనయుడు అమిత్ కుమార్ రెడ్డి హస్తం పార్టీవైపు చూస్తున్నారట.

మంత్రితో రహస్య భేటీ..?

పార్టీ మారాలని భావిస్తున్న గుత్తా ఫ్యామిలీ.. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని రహస్యంగా కలిసినట్లు తెలుస్తోంది. అమిత్ కుమార్ రెడ్డి స్వయంగా కోమటిరెడ్డి ఇంటికి వెళ్లి కలిశారట. పార్టీ మారే అంశంపై చర్చించారట. నల్లగొండ సీటును ఇప్పటికే జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డికి కేటాయించారు. దీంతో అమిత్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం లేదు. తాను పోటీ చేయకపోయినా పర్వాలేదు కానీ.. పార్టీ మారాలని ఫిక్స్ అయ్యారట.

అసలు కారణం ఇదేనట..?!

గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన తనయుడు అమిత్ పార్టీ మారడానికి ప్రధాన కారణం జగదీష్ రెడ్డి అనే ప్రచారం జరుగుతోంది. జగదీష్ రెడ్డి కారణంగానే వీరు బీఆర్ఎస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారట. వాస్తవానికి గుత్తా సుఖేందర్ రెడ్డి తన తనయుడు అమిత్ కుమార్ రెడ్డిని రాజకీయ నాయకుడిగా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అమిత్ కూడా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ.. ప్రజలతో మమేకం అవుతూ వస్తున్నారు. ఎన్నికలకు ముందు జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అమిత్‌కు టికెట్ ఇప్పించేందుకు గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రయత్నించారు. కానీ, జగదీష్ రెడ్డి అడ్డుకుని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇప్పించారట. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మునుగోడు టికెట్ కోసం గుత్తా ఫ్యామిలీ గట్టి ప్రయత్నమే చేసింది. కానీ, సిట్టింగ్‌ అభ్యర్థులకే మళ్లీ టికెట్ కేటాయించడంతో అప్పుడూ నిరాశే ఎదురైంది.

ఎంపీ సీటు దక్కడమూ కష్టమే..!

మునుగోడు టికెట్ దక్కకపోవడంతో కనీసం నల్లగొండ ఎంపీ టికెట్ దక్కుతుందని ఆశతో ఉన్న అమిత్‌ రెడ్డికి ఇక్కడా నిరాశే ఎదురైంది. అమిత్‌కు వ్యతిరేకంగా జగదీష్ రెడ్డి పావులు కదిపారట. ఆయనకు టికెట్ ఇవ్వొద్దని పార్టీ నేతలతో అధినేతకు కంప్లైంట్ చేశారని టాక్ నడుస్తోంది. మరోవైపు నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని దింపుతామని జగదీష్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. దాంతో ఎంపీ టికెట్‌పై అమిత్ ఆశలు వదులుకున్నారు. ఒకానొక సందర్భంలో తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని తన అనుచరుల వద్ద ప్రకటించారట.

జగదీష్ రెడ్డిపై ఆగ్రహం..!

తన రాజకీయ భవిష్యత్‌కు అడ్డు తగులుతున్న జగదీష్ రెడ్డికి చెక్ పెట్టాలని అమిత్ కుమార్ రెడ్డి భావిస్తున్నారట. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారట. అందుకే మంత్రి కోమటిరెడ్డిని కలిసి పార్టీ మారడంపై చర్చించినట్లు పొలిటికల్ సర్కిల్‌లో బిగ్ డిస్కషన్ నడుస్తోంది. అంతేకాదు.. ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా.. తన పొలిటికల్ కెరీర్‌కు అడ్డుతగులుతున్న జగదీష్ రెడ్డికి జిల్లాలో చెక్ పెట్టాలని, రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తీయాలని అమిత్ కుమార్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారని సమాచారం.

పార్టీ మారడంపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఏమన్నారంటే..

ఈ ప్రచారం ఇలా సాగుతుంటే.. బీఆర్ఎస్‌ను వీడటంపై శాసనమండి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను, తన కుమారుడు పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అంతా ఊహాగానమే అని కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరడంపై తాము ఎవరితోనూ భేటీ కాలేదన్నారు. ఈ విషయంపై గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన తనయుడు అమిత్ రెడ్డి సంయుక్తంగా క్లారిటీ ఇచ్చారు. నిరాధారమైన ప్రచారాన్ని పార్టీ శ్రేణులు నమ్మొద్దని అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 10 , 2024 | 05:17 PM

Advertising
Advertising