ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Komatireddy: ప్రజలే బీఆర్‌ఎస్‌ను చీల్చిచెండాడారు...

ABN, Publish Date - Jul 26 , 2024 | 01:53 PM

Telangana: భవిష్యత్తులో బడ్జెట్‌ను చీల్చి చెండాడుతామంటూ మాజీముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్‌ను ప్రజలు చీల్చి చండాడితేనే ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవక ఏడు సీట్లలో డిపాజిట్ కోల్పోయారని వ్యాఖ్యలు చేశారు.

Minister Komatireddy Venkatreddy

నల్గొండ, జూలై 26: భవిష్యత్తులో బడ్జెట్‌ను చీల్చి చెండాడుతామంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR) చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkatreddy)తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్‌ను ప్రజలు చీల్చి చండాడితేనే ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవక ఏడు సీట్లలో డిపాజిట్ కోల్పోయారని వ్యాఖ్యలు చేశారు. ‘‘నీ స్థానంలో ఎవరున్నా రాజకీయాలు బంద్ చేసుకొని శాశ్వతంగా రాజకీయాలు విరమించుకోవాలి. ఎనిమిది నెలలు ఇంట్లో ఉండి మధ్యలో రెండుసార్లు అసెంబ్లీ నడిచినా రాలేదు’’ అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan: పారిశుధ్య కార్మికులకు బకాయిలు 103 కోట్లు పెండింగ్


దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ రంగానికి 72 వేల కోట్లు కాంగ్రెస్ కేటాయించిందని చెప్పుకొచ్చారు. ‘‘నువ్వు ఏనాడైనా పెట్టావా కేసీఆర్’’ అంటూ ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం చేసేలా కేంద్రం ఘోరంగా బడ్జెట్ పెడితే ఎందుకు కేసీఆర్ మాట్లాడలేదని నిలదీశారు. బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనానికి చర్చలు జరుగుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అటువైపు అడుగులు పడుతున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. రేపు లోకల్ బాడీ ఎన్నికల వరకు బీఆర్ఎస్ ఉంటే అడ్రస్ లేకుండా చేస్తామన్నారు. బ్రాహ్మణ వెల్లంలో పది రోజుల్లో ట్రయల్ రన్ ఉంటుందని, డిసెంబర్‌లోపు కాల్వల నిర్మాణం పూర్తి అవుతుందని తెలిపారు. ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వేందుకు అమెరికా నుంచి మిషన్ బేరింగ్ వచ్చే నెల 10న వస్తుందన్నారు. త్వరలోనే సొరంగ నిర్మాణం పూర్తి చేసి 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.


కాగా.. తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే... సభలో బడ్జెట్ ప్రసంగం ముగింపు రెండు నిమిషాల ముందే బయటకు వచ్చిన కేసీఆర్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రతిపక్ష నేతగా తొలిసారి మాట్లాడారు. దాదాపు పదేళ్ల తర్వాత కేసీఆర్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులను, వృత్తి కార్మికులను వంచించిందని విమర్శించారు. బడ్జెట్ అంతా ట్రాష్‌. గ్యాస్‌ అని.. ఈస్ట్‌మన్‌ కలర్‌ మాదిరిగా చెప్పారని దుయ్యబట్టారు. ఓ కథ చెప్పినట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో పారిశ్రామిక పాలసీ లేదని.. ఐటీ పాలసీ లేదని అన్నారు. పేదలకు సంబంధించి ఈ సర్కారుకు ఓ పాలసీ అంటూ లేదన్నారు. ఇది పేదల, రైతు బడ్జెట్‌ కాదన్నారు. ఎవరి బడ్జెట్‌ అనేది విశ్లేషణలో తెలుస్తుందని.. భవిష్యత్తులో దీన్ని చీల్చి చెండాడతామంటూ మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు.

AP Assembly Session 2024: అసెంబ్లీ తెరపై జగన్ పాపాలు .. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల


మరోవైపు బడ్జెట్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. కేంద్ర బడ్జెట్‌పై స్పందించని కేసీఆర్.. రాష్ట్ర బడ్జెట్‌ మీద మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి సీతక్క విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడని కేసీఆర్.. రాష్ట్ర బడ్జెట్‌ను విమర్శించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని మంత్రి అన్నారు. ‘‘ఎన్నడూ లేని విధంగా ఈ రోజు కేసీఆర్ మీడియా పాయింట్‌కి వచ్చారు. తొందర్లోనే కోర్టు బోన్‌లోకి వస్తారు. కేసీఆర్ ఊహల్లో బతికారు. ఇంకా నేనే రాజు అనుకుంటున్నారు. మీరు పెట్టిన బడ్జెట్ ఎవరికి ఉపయోగపడలేదు’’ అంటూ ఎమ్మెల్యే వంశీ కృష్ణ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి బడ్జెట్ దగ్గర ఉందని... అందుకే ప్రతిపక్షానికి మింగుడు పడటం లేదని మరో ఎమ్మెల్యే సంజీవ రెడ్డి అన్నారు.


ఇవి కూడా చదవండి...

Stock Markets: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాభాల స్టాక్స్!

Harish Rao: సర్కార్ తీరుతో రైతులకు కొత్త సమస్యలు షురూ...

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 26 , 2024 | 01:57 PM

Advertising
Advertising
<