ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Uttam: 2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని ఎవ్వరూ ఆపలేరు..

ABN, Publish Date - Aug 17 , 2024 | 02:56 PM

2029 పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని ఎవ్వరూ ఆపలేరని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నేత కష్టపడి పని చేసి ఆ దిశగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

Minister Uttam Kumar Reddy

సూర్యాపేట: 2029 పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని ఎవ్వరూ ఆపలేరని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నేత కష్టపడి పని చేసి ఆ దిశగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయాల్సిన బాధ్యత సోషల్ మీడియా సోల్జర్స్‌పై ఉందని ఆయన చెప్పారు. తాను ఇప్పుడే సోషల్ మీడియా గురించి నేర్చుకుంటున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు.


ప్రధాని మోడీని అడ్డుకున్నాం..

ఈ తరంలో ప్రజలకు చేరువైయేందుకు సోషల్ మీడియా బలమైన సాధనం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ మీడియా సంస్థలను మూసివేశారని, కానీ సోషల్ మీడియాని ఆపలేకపోయారన్నారు. ఆ మాధ్యమం ద్వారానే కాంగ్రెస్ ప్రచారం చేసి బీజేపీ సీట్లు తగ్గేలా చేయగలిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. 2029ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి దీన్నే ప్రధాన మాధ్యమంగా వాడుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.


టికెట్ కష్టమే..!

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వాళ్లకు పార్టీలో సరైన ప్రాధాన్యత ఉంటుందని మంత్రి అన్నారు. ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు ఒక సోషల్ మీడియా సోల్జర్‌ని నియమించాలని నేతలకు పిలుపునిచ్చారు. ఇందుకు కాంగ్రెస్ మండల, గ్రామ శాఖల అధ్యక్షులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. అలాగే మహిళలు, మహిళా సంఘాల సభ్యులను సోషల్ మీడియాలో యాక్టివ్ చేయించాలని చెప్పారు. సోషల్ మీడియాపై నాలెడ్జ్ లేకుంటే నేతలకు పార్టీ టికెట్ ఇవ్వడం కష్టమే అని మంత్రి అన్నారు.


చురుగ్గా ప్రచారం చేయండి..

కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో తాము చేస్తున్న అభివృద్ధి పనులు ప్రచారం చేయడంలో వెనకపడినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అభివృద్ధిలో రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలం ఎంత చురుగ్గా ఉన్నామో అదే విధంగా సోషల్ మీడియాలో వాటిని ప్రచారం చేయడంలో స్థానిక నేతలు అంతే చురుగ్గా ఉండాలని మంత్రి ఆదేశించారు. కోదాడు, హుజూర్నగర్‌ నియోజకవర్గాల్లో ఏ ఒక్క ఎకరం ఎండిపోవడానికి వీల్లేదని, అందుకు ప్రతి లిఫ్ట్‌కు మరమ్మతులు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

Updated Date - Aug 17 , 2024 | 02:56 PM

Advertising
Advertising
<