ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS Politics: హరీష్ కాంగ్రెస్‌లోకి వస్తే ఆ పదవి ఇస్తాం.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్

ABN, Publish Date - Feb 12 , 2024 | 06:05 PM

మాజీమంత్రి హరీష్ రావు‌ (Harish Rao)పై కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Rajagopal Reddy) సెటైర్లు వేశారు. హరీష్‌ రావును కాంగ్రెస్‌లోకి రమ్మని ఆహ్వానించారు. హరీష్ రావు బీఆర్ఎస్‌లో బాగా కష్టపడతారని కానీ ఆయనకు ఆ పార్టీలో భవిష్యత్ లేదని చెప్పారు.

నల్గొండ: మాజీమంత్రి హరీష్ రావు‌ (Harish Rao)పై కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Rajagopal Reddy) సెటైర్లు వేశారు. హరీష్‌ రావును కాంగ్రెస్‌లోకి రమ్మని ఆహ్వానించారు. హరీష్ రావు బీఆర్ఎస్‌లో బాగా కష్టపడతారని కానీ ఆయనకు ఆ పార్టీలో భవిష్యత్ లేదని చెప్పారు. హరీష్ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్‌లోకి 26 మందిని తీసుకువస్తే హరీష్‌కు దేవాదాయ శాఖ ఇస్తామని అన్నారు. ఆయన కాంగ్రెస్‌లోకి వస్తే చేసిన పాపాలు కడుక్కోవచ్చని అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కడియం శ్రీహరి లాగా తాము జీ హుజూర్ బ్యాచ్ కాదన్నారు. వీరిద్దరూ కాంగ్రెస్‌ను చీల్చాలని గుంటకాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారని ఆరోపించారు.

తాము పదవుల కోసం కాదని.. ప్రజల కోసం ఉండేవాళ్లమని తెలిపారు. బీఆర్ఎస్ చీప్ పాలిటిక్స్ మానుకోవాలని హితవు పలికారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత తమపై పడిందని తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్‌కు దమ్ముంటే పార్టీని నడపాలని సవాల్ విసిరారు. నల్గొండ సభ అట్టర్ ప్లాప్ అవుతుందని అన్నారు. ఆ సభకు ప్రజలు రారని.. కార్యకర్తలు మాత్రమే వస్తారని తెలిపారు. బీఆర్ఎస్‌ను ఇంటి బాట పట్టించినందుకే కేసీఆర్ పోరుబాట పట్టారా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌ను పజలు అసహ్యించు కుంటున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 07:10 PM

Advertising
Advertising