ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kaleshwaram Project: బ్యారేజీల పరీక్షల రిపోర్టులు ఇవ్వండి..

ABN, Publish Date - Jul 23 , 2024 | 03:59 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలు దెబ్బతినడానికి గల కారణాలు తెలుసుకోవడానికి తాము సూచించిన సిఫారసుల ప్రకారం జరిగిన పరీక్షల నివేదికలు అందించాలని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) ఆదేశించింది.

  • నీటి పారుదల శాఖ అధికారులకు ఎన్‌డీఎ్‌సఏ ఆదేశం

  • గ్రౌటింగ్‌ చేశాక పరీక్షలు ఎలా ప్రారంభిస్తారని వ్యాఖ్య

హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలు దెబ్బతినడానికి గల కారణాలు తెలుసుకోవడానికి తాము సూచించిన సిఫారసుల ప్రకారం జరిగిన పరీక్షల నివేదికలు అందించాలని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) ఆదేశించింది. సోమవారం న్యూఢిల్లీలో ఎన్‌డీఎ్‌సఏ చైర్మన్‌ అనిల్‌ జైన్‌, నిపుణుల కమిటీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌తో పాటు తెలంగాణ నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఈఎన్‌సీ(జనరల్‌) జి.అనిల్‌కుమార్‌, ఈఎన్‌సీ(ఓ అండ్‌ ఎం) నాగేందర్‌రావు, రామగుండం సీఈ సుధాకర్‌రెడ్డి సమావేశమయ్యారు.


బ్యారేజీలకు తాము చెప్పిన పరీక్షలన్నీ చేశారా..? అని ఎన్‌డీఎ్‌సఏ అధికారులు ప్రశ్నించగా.. మేడిగడ్డలో బోర్‌ హోల్స్‌ వేస్తుండగా ఇసుక, నీరు బయటికి రావడంతో పరీక్షలను నిలిపివేశామని అధికారులు బదులిచ్చారు. పరీక్షలకు ముందే ప్లింత్‌ శ్లాబు కింద గ్రౌటింగ్‌ చేయడంతో బోర్‌హోల్స్‌ వేయగానే ఇసుకతో పాటు నీరు బయటికి వచ్చిందని, గ్రౌటింగ్‌ చేశాక పరీక్షలు ఎలా ప్రారంభిస్తారని ఎన్‌డీఎస్‌ఏ ప్రశ్నించింది. ఇప్పటిదాకా జరిగిన పరీక్షల నివేదికలన్నీ అందించాలని కోరగా, మంగళవారం ఇస్తామని అధికారులు చెప్పారు.

Updated Date - Jul 23 , 2024 | 03:59 AM

Advertising
Advertising
<