ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TGIISC: న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లా. రాయదుర్గంలో టి-స్క్వేర్‌..

ABN, Publish Date - Jul 13 , 2024 | 04:37 AM

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ తరహాలో.. రాష్ట్రంలోనూ అలాంటి ఒక ఐకానిక్‌ ప్లాజాను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ) సిద్ధమైంది.

  • నాలెడ్జ్‌ సిటీ దగ్గర్లో ఐకానిక్‌ ప్లాజా

  • ఏర్పాటు ప్రణాళికల్లో టీజీఐఐసీ

  • పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే యోచన

  • ఆగస్టు 9లోగా బిడ్‌ దాఖలుకు చాన్స్‌

హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రసిద్ధి గాంచిన న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ తరహాలో.. రాష్ట్రంలోనూ అలాంటి ఒక ఐకానిక్‌ ప్లాజాను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ) సిద్ధమైంది. రాయదుర్గంలో 30 ఎకరాల్లో ఏర్పాటు చేసిన నాలెడ్జ్‌ సిటీ సమీపంలో.. ‘టి-స్క్వేర్‌’ పేరిట దీన్ని నిర్మించాలని ప్రతిపాదించి, ఈమేరకు టెండర్లు ఆహ్వానించింది. ఆసక్తి ఉన్న ఏజెన్సీలు బిడ్‌ దాఖలు చేయడానికి ఆగస్టు 9 వరకూ అవకాశం కల్పించింది. క్వాలిటీ కమ్‌ కాస్ట్‌ బేస్డ్‌ సెలక్షన్‌ (క్యూసీబీఎస్‌) పద్ధతిలో నిర్మాణ సంస్థను ఎంపిక చేయనున్నట్టు టీజీఐఐసీ పేర్కొంది.


రోజువారీ పనులతో సతమతమయ్యే ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని, వినోదాన్ని అందించేలా ఈ ‘టి-స్క్వేర్‌’ నిర్మాణం, ఏర్పాట్లు ఉండాలని నిర్ణయించారు. నగరంలో ప్రధాన పర్యాటక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రముఖుల పుట్టినరోజుల వేడుకలు, సినిమాల అప్‌డేట్లు, అవార్డులు, చారిత్రక విశేషాల వంటివాటిని న్యూయార్క్‌లోని ప్రధాన వాణిజ్య కూడలి అయిన టైమ్స్‌ స్క్వేర్‌లో ప్రదర్శిస్తుంటారు. రాయదుర్గంలోని ‘టి-స్క్వేర్‌’ నిర్మాణం పూర్తయితే.. అలాంటి ప్రదర్శనలు హైదరాబాద్‌లోనూ చూసే అవకాశం ఉంటుంది.

Updated Date - Jul 13 , 2024 | 04:37 AM

Advertising
Advertising
<