ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Christmas 2024: 6 గంటల్లో 60 సూట్లు.. టైలర్‌కు నిజాం ప్రభువు క్రిస్‌మస్ చాలెంజ్

ABN, Publish Date - Dec 25 , 2024 | 04:50 PM

Christmas 2024: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు అందరూ క్రిస్మస్ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చర్చికి వెళ్లి యేసు క్రీస్తును ప్రార్థిస్తున్నారు. చర్చిలను లైట్లతో అందంగా అలంకరిస్తున్నారు.

Christmas 2024

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు అందరూ క్రిస్మస్ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చర్చికి వెళ్లి యేసు క్రీస్తును ప్రార్థిస్తున్నారు. చర్చిలను లైట్లతో అందంగా అలంకరిస్తున్నారు. ఆటపాటలతో ఈ పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు. యేసు దీవెనలు తమ మీద ఉండాలని ప్రార్థనలు చేస్తున్నారు. తమ కోరికలు నెరవేర్చాలని జీసస్‌ను కోరుకుంటున్నారు. క్రిస్‌మస్ కావడంతో అందరూ పండుగ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. అప్పట్లో ఓ దర్జీకి నిజాం ప్రభువు విసిరిన క్రిస్‌మస్ చాలెంజ్‌ను అందరూ గుర్తుచేసుకుంటున్నారు. ఆ సవాల్ ఏంటి? ఎందుకు చాలెంజ్ చేశారు? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


రియల్ ట్విస్ట్

అది 1954వ సంవత్సరం, డిసెంబర్ 24వ తేదీ రాత్రి. అప్పటికే బాగా పేరుగాంచిన జాన్ బర్టన్ అనే ఓ దర్జీని కింగ్ కోఠిలోని తన ప్యాలెస్‌కు పిలిపించారు 7వ నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. దుస్తుల్ని అందంగా, ఆకర్షణీయంగా కుట్టడంలో బర్టన్‌ సిద్ధహస్తుడు. అందుకే అతడ్ని క్రిస్‌మస్‌ కోసం సూట్లు కుట్టాల్సిందిగా పిలిపించారు నిజాం ప్రభువు. తనతో పాటు చుట్టూ ఉండే మొత్తం పరివారానికి సరిపడా సూట్లు కుట్టాల్సిందిగా ఆదేశించారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. నిజాం పరివారం మొత్తం 60 మంది. క్రిస్‌మస్ మెయిన్ ఈవెంట్‌కు మరో 6 గంటల సమయమే ఉంది. అంటే 6 గంటల్లో 60 సూట్లు, ప్యాంట్లు, షర్ట్స్ కుట్టాలన్నమాట. ఇది వినగానే బర్టన్‌కు మైండ్ బ్లాంక్ అయింది.


చేతుల్ని యంత్రాల్లా మార్చి..

బట్టలు కుట్టడంలో ఎంత నిష్ణాతుడు అయినప్పటికీ అంత తక్కువ సమయంలో అన్ని సూట్లు కుట్టడం అంటే మామూలు విషయం కాదు. కానీ నిజాం ప్రభువు ఆజ్ఞ. దీంతో సవాల్‌గా తీసుకొని క్షణం కూడా వృథా కాకుండా కుట్టాడు బర్టన్. నిమిషం నిమిషానికి టైమ్ చూసుకుంటూ.. చేతుల్ని యంత్రం కంటే వేగంగా పరుగులు పెట్టించాడు. మెదడును సూపర్ కంప్యూటర్‌లా మార్చేశాడు. తన దగ్గర ఉన్న దర్జీలకు ఒక్కొక్కరికి ఒక్కో పని అప్పగించాడు. కొందరు షర్ట్స్, ఇంకొందరు ప్యాంట్స్, మరికొందరు సూట్స్ కుట్టే పనిలో నిమగ్నమయ్యారు. అవన్నీ సరిగ్గా ఉన్నాయా? లేదా? సరిచేయాలా? అనేది బర్టన్ చూసుకున్నాడు. బట్టలన్నీ కచ్చితమైన కొలతలతో అందంగా, ఆకర్షణీయంగా ఉండేలా చూసుకున్నాడు. ఎంత ఒత్తిడి, టైమ్ ప్రెజర్ ఉన్నా అప్పగించిన పనిని సరైన సమయంలో పూర్తి చేసి నిజాంతో శభాష్ అనిపించుకున్నాడు. బర్టన్ పనితనాన్ని మెచ్చి అతడికి కొన్ని అరుదైన బహుమతులు అందజేశాడు నిజాం.


Also Read:

మెదక్ చర్చితో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సీఎం రేవంత్

దాని వెనుకనున్న మతలబేంటో సీఎం బయటపెట్టాలి

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నోటీసులు

For More Telangana And Telugu News

Updated Date - Dec 25 , 2024 | 04:58 PM