MP Arvind: పసుపు బోర్డును తీసుకొచ్చే బాధ్యత నాది
ABN, Publish Date - Apr 25 , 2024 | 04:36 PM
Telangana: పసుపు బోర్డుపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పసుపు బోర్డుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇందూరు గడ్డపైనే పసుపు బోర్డు వస్తదని.. నరేంద్ర మోదీ వచ్చి ఇందూరు గడ్డపై చెప్పిపోయారని అన్నారు. దీన్ని నిజామాబాద్ తీసుకొచ్చే బాధ్యత తనది అని ఎంపీ స్పష్టం చేశారు. నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో బీజేపీ సభలో అర్వింద్ మాట్లాడుతూ.. జిల్లాను వేల కోట్లతో అభివృద్ధి చేసుకున్నామని..
నిజామాబాద్, ఏప్రిల్ 25: పసుపు బోర్డుపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (BJP MP Candidate Dharmapuri Arvind) కీలక వ్యాఖ్యలు చేశారు. పసుపు బోర్డుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇందూరు గడ్డపైనే పసుపు బోర్డు వస్తదని.. నరేంద్ర మోదీ (PM Modi) వచ్చి ఇందూరు గడ్డపై చెప్పిపోయారని అన్నారు. దీన్ని నిజామాబాద్ తీసుకొచ్చే బాధ్యత తనది అని ఎంపీ స్పష్టం చేశారు. నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో బీజేపీ సభలో అర్వింద్ మాట్లాడుతూ..జిల్లాను వేల కోట్లతో అభివృద్ధి చేసుకున్నామని.. కొత్త రైల్వే లైన్లు తెచ్చుకున్నామన్నారు. రానున్న కాలంలో మరిన్ని రైల్వే లైన్లు తెస్తామని హామీ ఇచ్చారు. జక్రాన్ పల్లి ఎయిర్‌పోర్టు పనులు వేగవంతం చేస్తామని.. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సహకరించడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎన్‌ఆర్‌ఐల మీద దొంగ ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు.
MLC Election: తెలంగాణలో మరో ఎన్నిక.. షెడ్యూల్ విడుదల
కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి నాలుగు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అని.. కానీ ఒక్కసారి కూడా ఈ జిల్లాకు రాలేదని అన్నారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అని అన్నారని... సీఎం సెప్టెంబర్ 17లోవు అంటే... వారే వేసిన కమిటీ మాత్రం డిసెంబర్‌లో అంటుందని తెలిపారు. అబద్ధపు హామీలను దేవుళ్లపై ఒట్టేసి చెప్తున్నారన్నారు. టోపీ పెట్టి అల్లాపై ఒట్టేసి చెప్పండి చూద్దామని అన్నారు. ఇస్లామిక్ దేశాల్లో మందిరాలు కడుతున్నారని... అది అసలైన సెక్యులరిజమని తెలిపారు. ముస్లింలకు హిందువుల సంపదదోచి పెడతారట.. వారి మేనిఫెస్టోలోనే ముస్లింలకు అనుకూలంగా హామీలు ఇచ్చారు అంటూ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలు చేశారు.
కాగా.. నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా అర్వింద్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, నాయకులు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు సూర్యనారాయణ గుప్తా, రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
AP Elections: ఒకేసారి ఆర్డీవో ఆఫీస్‌కు టీడీపీ, వైసీపీ అభ్యర్థులు.. పరిస్థితి ఉద్రిక్తం
Read Latest Telangana News And Telugu News
Updated Date - Apr 25 , 2024 | 04:48 PM