ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ‘సమ్మక్క సాగర్‌’పై పరిశీలన..

ABN, Publish Date - Jun 22 , 2024 | 03:30 AM

గోదావరి-కావేరి నదుల అనుసంధానంలో ఇచ్చంపల్లి వద్దే బ్యారేజీ/రిజర్వాయర్‌ నిర్మిస్తామని ఇంతకాలం పట్టుబట్టిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో ఒక మెట్టు దిగింది.

  • ఇచ్చంపల్లి బ్యారేజీపై బెట్టు సడలింపు!

  • రాష్ట్ర అభ్యంతరాలతో కేంద్రంలో కదలిక

  • ఎన్‌డబ్ల్యూడీఏ ఎజెండాలో చోటు

  • 9న భేటీ.. రాష్ట్రాలకు సమాచారం

హైదరాబాద్‌, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): గోదావరి-కావేరి నదుల అనుసంధానంలో ఇచ్చంపల్లి వద్దే బ్యారేజీ/రిజర్వాయర్‌ నిర్మిస్తామని ఇంతకాలం పట్టుబట్టిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో ఒక మెట్టు దిగింది. గోదావరి బేసిన్‌లోని ఇంద్రావతి నదిపైౖ సమ్మక్క సాగర్‌ (తుపాకులగూడెం) వద్ద తెలంగాణ కడుతున్న బ్యారేజీ నుంచి నీటిని తరలించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించి, అధ్యయనం చేయాలని నిర్ణయించింది. జూలై 9న జాతీయ నీటి అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) పాలకమండలి సమావేశం జరుగనుంది. దీని ఎజెండాను శుక్రవారం రాష్ట్రాలకు పంపింది. ఇందులో.. సమ్మక్క సాగర్‌ బ్యారేజీ, నిల్వ సామర్థ్యం పెంపును పరిశీలించనున్నట్లు సమాచారం ఇచ్చింది. గోదావరి-కావేరి నదుల అనుసంధానంలో భూపాలపల్లి జిల్లా ఇచ్చంపల్లి వద్ద 87 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ కట్టి, నీటిని తరలిస్తామని గతంలో కేంద్రం ప్రకటించింది.


అదే ప్రతిపాదనకు చాలాకాలంగా కట్టుబడి ఉంది. దీనికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అంగీకరించలేదు. కాంగ్రెస్‌ సర్కారు వచ్చాక కూడా అదే వాదన వినిపించింది. అయితే, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తుపాకులగూడెం బ్యారేజీ నుంచి అనుసంధానం చేపడితే అభ్యంతరాలు లేవని కూడా ఎన్‌డబ్ల్యూడీఏకు తెలిపింది. తెలంగాణ ప్రాంతంలో గోదావరి నీటిని అందించడానికి వీలుగా 1980లో 118 మీటర్ల ఎత్తుతో ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణానికి బచావత్‌ ట్రైబ్యునల్‌ అనుమతి ఇచ్చింది. కానీ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర అభ్యంతరాలతో ఎత్తును 112 మీటర్లకు తగ్గించారు. మళ్లీ 1986-88లో 108 మీటర్లకు, కాలక్రమంలో 105 మీటర్లకు కుదించారు. తాజాగా నదుల అనుసంధానంలో 87 మీటర్లకు పరిమితం చేశారు. అయినా.. తమ నాలుగు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని ఛత్తీ్‌సగఢ్‌ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మహారాష్ట్ర కూడా కొన్ని సందేహాలు లేవనెత్తింది.


తెలంగాణ అభ్యంతరాలతో..

ఇచ్చంపల్లి నుంచి 24 కిలోమీటర్ల దిగువనే తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజీ ఉంది. తక్కువ దూరం ఉన్నందున.. ఇచ్చంపల్లి నుంచి ఆకస్మికంగా వరద విడుదలైతే నియంత్రించలేమని తెలంగాణ పలుమార్లు అభ్యంతరాలు తెలిపింది. ఇచ్చంపల్లి దిగువన 158 టీఎంసీల నీటి వినియోగం ఉందని, ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మించి ఏకకాలంలో.. గోదావరి- కావేరి అనుసంధానంతో పాటు దిగువన ఉన్న ప్రాజెక్టుల నీటి అవసరాలు తీర్చడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. తాజాగా మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, మరమ్మతులు చేసినా, బ్యారేజీ మళ్లీ దెబ్బతినదని చెప్పలేమని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) నివేదిక ఇవ్వడంతో కేంద్రం కొత్త ప్రతిపాదనను తెచ్చింది.


మేడిగడ్డను పునరుద్ధరించకపోతే ఇచ్చంపల్లి వద్ద ఎత్తు పెంచి రిజర్వాయర్‌ కట్టి, తిరుగు జలాలను కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద వాడుకోవడానికి వెసులుబాటు ఇస్తామని తెలంగాణకు సూచన చేసింది. కాగా, మేడిగడ్డ పునరుద్ధరణ ఇప్పట్లో సాధ్యం కానందున ఇచ్చంపల్లికి ఒప్పుకోవాలని సాగు నీటి నిపుణులూ ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో ఎన్‌డబ్ల్యూడీఏ పాలకమండలి ఏం నిర్ణయం తీసుకోనుందో తేలనుంది.

Updated Date - Jun 22 , 2024 | 03:30 AM

Advertising
Advertising