Kaleshwaram: మేడిగడ్డ బ్యారేజీ వద్ద కొనసాగుతున్న పనులు..
ABN, Publish Date - May 31 , 2024 | 04:45 AM
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్-7లో తాత్కాలిక మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఇసుక గ్రౌటింగ్ కోసం డ్రిల్లింగ్ పనులు నడుస్తుండగా.. దిగువన షీట్ పైల్స్ అమరిక, సీసీ బ్లాకుల రీ అరెంజ్‌మెంట్ పనులు కొనసాగుతున్నాయి.
మహదేవపూర్ రూరల్, మే 30: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్-7లో తాత్కాలిక మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఇసుక గ్రౌటింగ్ కోసం డ్రిల్లింగ్ పనులు నడుస్తుండగా.. దిగువన షీట్ పైల్స్ అమరిక, సీసీ బ్లాకుల రీ అరెంజ్‌మెంట్ పనులు కొనసాగుతున్నాయి. దెబ్బతిన్న 7వ బ్లాకుల్లోని 19, 20, 21 గేట్ల ముందున్న బే ప్రాంతంలో గ్రౌటింగ్ కోసం రంధ్రాలు చేసే పని పూర్తవగా, మిగతా గేట్ల బే ప్రాంతాల్లో డ్రిల్లింగ్ పనులు కొనసాగుతున్నాయి.గురువారం నాటికి మూడు గేట్ల ముందున్న బే ప్రాంతాల్లో డ్రిల్లింగ్ పూర్తవగానే ఇసుక గ్రౌటింగ్ ప్రారంభించాలని భావించిన అధికారులు.. డ్రిల్లింగ్ పూర్తయినా పనులు చేపట్టలేదు. మిగతా గేట్ల ముందున్న బే ప్రాంతాల్లో డ్రిల్లింగ్ పూర్తయ్యాకే ఇసుక గ్రౌటింగ్ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Updated Date - May 31 , 2024 | 04:45 AM