ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KCR: అసెంబ్లీకి కేసీఆర్‌!

ABN, Publish Date - Jul 25 , 2024 | 03:02 AM

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ప్రతిపక్ష నేత హోదా లో గురువారం తొలిసారి అసెంబ్లీకి రానున్నారు. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్‌ వర్గాలు బుధవారం వెల్లడించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌ దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే.

  • ప్రతిపక్ష నేత హోదాలో నేడు తొలిసారి

  • బడ్జెట్‌ సమావేశాలకు

  • హాజరు కానున్న బీఆర్‌ఎస్‌ అధినేత

  • వెల్లడించిన పార్టీ వర్గాలు

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ప్రతిపక్ష నేత హోదా లో గురువారం తొలిసారి అసెంబ్లీకి రానున్నారు. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్‌ వర్గాలు బుధవారం వెల్లడించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌ దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలకూ ఆయన గైర్హాజరయ్యారు. కేవలం ఎమ్మెల్యేగా ప్రమా ణం చేయడానికి మాత్రమే ఒక్కసారి ఆయన అసెంబ్లీకి వచ్చారు. ప్రస్తుతం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కేసీఆర్‌ హాజరుపై మళ్లీ చర్చ మొదలైంది.


అసెంబ్లీ సమావేశాలకు ఆయన వస్తారా లేదా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే విషయంపై బుధవారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి సహా.. పలువురు మంత్రులు మాట్లాడుతూ ప్రతిపక్షనేత ఎక్కడ దాక్కున్నారు? అసెంబ్లీకి రారా? అని బీఆర్‌ఎస్‌ సభ్యులను ప్రశ్నించారు. అయితే గురువారం కేసీఆర్‌ అసెంబ్లీకి రానున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో సర్వ త్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ లాబీ లో ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు కేటాయించిన చాంబర్‌లో ఎలాంటి మార్పులు ఉండవని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. గతంలో కేటాయించిన చాంబర్‌ను ఉపయోగించాల్సిందేనని స్పష్టం చేశాయి. కేసీఆర్‌కు ఇరుకైన చాంబర్‌ కేటాయించారని, తమ నేతను అవమానపరిచే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆరోపించిన విషయం తెలిసిందే.

Updated Date - Jul 25 , 2024 | 08:16 AM

Advertising
Advertising
<