ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Siddipet: పదహారేళ్ల బాలుడితో వివాహిత పరార్‌..

ABN, Publish Date - Jun 16 , 2024 | 05:05 AM

జల్సాలకు అలవాటు పడిన ఓ వివాహిత.. ఇంటి యజమాని వద్ద ఉన్న డబ్బు, నగలపై కన్నేసింది. యజమాని కుమారుడైన పదహారేళ్ల బాలుడిని ప్రేమలోకి దింపి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆపై అబ్బాయి ద్వారా వారి ఇంట్లోని డబ్బు, నగలను తెప్పించింది.

  • భర్త, పిల్లలను వదిలేసి చెన్నైకి పలాయనం

  • అద్దె గదిలో శారీరక బంధం

  • బాలుడి ఇంట్లోని నగలు, డబ్బు తీసుకెళ్లి జల్సాలు

  • మహిళను అరెస్టు చేసిన సిద్దిపేట పోలీసులు

సిద్దిపేట క్రైం, జూన్‌ 15 : జల్సాలకు అలవాటు పడిన ఓ వివాహిత.. ఇంటి యజమాని వద్ద ఉన్న డబ్బు, నగలపై కన్నేసింది. యజమాని కుమారుడైన పదహారేళ్ల బాలుడిని ప్రేమలోకి దింపి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆపై అబ్బాయి ద్వారా వారి ఇంట్లోని డబ్బు, నగలను తెప్పించింది. వాటిని సర్దుకుని, భర్త పిల్లలను వదిలేసి.. ఆ బాలుడిని తీసుకుని చెన్నై వెళ్లిపోయింది. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన సిద్దిపేట టూ టౌన్‌ పోలీసులు.. ఆ మహిళను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోలంకి అలియాస్‌ గైక్వాడ్‌ రాధ భర్త పిల్లలతో కలిసి సిద్దిపేటలోని హనుమాన్‌నగర్‌లో మూడేళ్ల క్రితం ఓ ఇంట్లో అద్దెకు దిగింది. ఆ ఇంటి యజమాని కుమారుడైన 16 ఏళ్ల బాలుడిని మాయ మాటలతో లోబరుచుకుని అతడితో బలవంతంగా శృంగారంలో పాల్గొంది. కొన్ని రోజుల తర్వాత ఆ బాలుడితో ఎక్కడికైనా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న ఆమె.. అతడిని ఒప్పించింది.


బాలుడి ఇంట్లో ఉన్న డబ్బులు, నగలను అతడి ద్వారానే తెప్పించుకుంది. ఆపై భర్త, పిల్లలను వదిలేసి జనవరి 24న బాలుడిని తీసుకొని చెన్నై వెళ్లిపోయింది. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సిద్దిపేట టూ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో ఆ మహిళ చెన్నైలో ఉన్నట్లు గుర్తించారు. ఎలాగైనా పోలీసులు పట్టుకుంటారని గ్రహించిన ఆమె.. ఈ నెల 11న బాలుడిని సిద్దిపేటలో వదిలేసింది. దీంతో అతడు ఇంటికి చేరుకున్నాడు. బాలుడి తల్లి అతడిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లింది. ఏం జరిగిందని పోలీసులు విచారించగా.. ఆ మహిళ చెన్నైలో ఒక రూమ్‌ కిరాయికి తీసుకొని తనను ఉంచిందని తెలిపాడు. అక్కడ తనను బలవంతపెట్టి తరచూ శారీరకంగా కలిసిందని చెప్పాడు. వెంట తీసుకెళ్లిన డబ్బులు ఖర్చయిన తర్వాత బంగారాన్ని చెన్నైలో గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మేసిందని తెలిపాడు. ఆ నగదు కూడా జల్సాలకు అయిపోయిందని చెప్పాడు. పోలీసులు పోక్సో కేసు పెట్టి ఆ మహిళను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.

Updated Date - Jun 16 , 2024 | 05:05 AM

Advertising
Advertising