ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Congress: రైతులను కాదు.. తీహార్ జైలులో ఉన్న కవితను పరామర్శించండి.. కాంగ్రెస్..

ABN, Publish Date - Mar 31 , 2024 | 03:22 PM

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యంత్రి కేసీఆర్ చేపట్టిన పర్యటనపై కాంగ్రెస్ ( Congress ) నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కేసీఆర్ తీహార్ జైలులో ఉన్న కవితను పరామర్శిస్తే బాగుండేదని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యంత్రి కేసీఆర్ చేపట్టిన పర్యటనపై కాంగ్రెస్ ( Congress ) నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కేసీఆర్ తీహార్ జైలులో ఉన్న కవితను పరామర్శిస్తే బాగుండేదని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పర్యటన విడ్డూరంగా ఉందన్న ఆమె.. కేసీఆర్ పర్యటించిన పొలంలో వరసగా నాలుగు బోర్లు వేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ పొలానికి పక్కనే ఉన్న పొలంలోని బోరులో నీరు వస్తోందని చెప్పారు. కాళేశ్వరం కుంగి నీటిని దిగువకు విడుదల చేశారు కాబట్టే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్లు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దయాకర్ రావు జైలుకు వెళ్లడం ఖాయమని స్ఫష్టం చేశారు.

Telangana: ఒక్కో ఎకరాకు రూ.30 వేలు ఇవ్వాలి.. మాజీ మంత్రి పువ్వాడ..

రైతులను పరామర్శిస్తూ కేసీఆర్ చేపట్టిన పర్యటన అనంతా స్క్రిప్ట్ డ్ అని కాంగ్రెస్ లీడర్ ఝాన్సీ ఆరోపించారు. అసెంబ్లీలో అడుగుపెట్టని కేసీఆర్ ఇక్కడికి రావడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులపై కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈదుల పర్రె తండా మీదుగా ఆయన సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశించారు. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత మొదటిసారి కేసీఆర్ జిల్లాల పర్యటనకు బయలుదేరిన నేపథ్యంలో ఆయన బస్సును అధికారులు తనిఖీ చేశారు.

Elections 2024: ఆర్థిక మంత్రులు లోక్ సభ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయరు.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 31 , 2024 | 03:42 PM

Advertising
Advertising