ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Political Criticism: నిరుద్యోగులను రెచ్చగొడుతున్న రేవంత్‌

ABN, Publish Date - Jul 15 , 2024 | 04:17 AM

రాష్ట్రంలో గ్రూప్స్‌, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు వారి డిమాండ్ల సాధన కోసం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తుంటే.. కనీసం స్పందించకపోగా.. ముఖ్యమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.

  • వారికిచ్చిన హామీలను నిలబెట్టుకోండి: హరీశ్‌ రావు

హైదరాబాద్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గ్రూప్స్‌, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు వారి డిమాండ్ల సాధన కోసం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తుంటే.. కనీసం స్పందించకపోగా.. ముఖ్యమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారంపై దృష్టిపెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఆదివారం బహిరంగ లేఖ రాశారు. రాహుల్‌గాంధీ సహా ఇతర కాంగ్రెస్‌ నాయకులు గ్రంథాలయాలు, కోచింగ్‌ సెంటర్లకు వెళ్లి ఇచ్చిన హామీలను పరిష్కరించాలని అభ్యర్థులు కోరుతుంటే.. పరిష్కారం దిశగా ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. నిరుద్యోగుల పోరాటం వెనుక రాజకీయ శక్తులున్నాయంటూ నిందారోపణలు చేయడం ఆక్షేపణీయమని అన్నారు. రేవంత్‌ ప్రతిపక్షంలో ఉన్నపుడు నిరుద్యోగుల కోసం మౌన దీక్షకు కూర్చున్న విషయం గుర్తు లేదా..? అని ప్రశ్నించారు.


నిరాహార దీక్షలు చేస్తున్న వారెవరూ పరీక్షలు రాయడం లేదని అపహాస్యం చేయడం నిరుద్యోగులను రెచ్చగొట్టడమే అన్నారు. మోతీలాల్‌ అనే విద్యార్థి గ్రూప్‌ 1,2,3పోస్టులకు దరఖాస్తు చేసిన విషయాన్ని ఆధారాలతో సహా అభ్యర్థులు బయట పెట్టిన విషయాన్ని గుర్తించాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సహా అభ్యర్థులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించడం, ఇనుప కంచెలు వేయడం, నిరుద్యోగులు, విద్యార్థులను నిర్బంఽధించడం, ముందస్తు అరెస్టులు చేయడం వంటివి అప్రజాస్వామికమన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా సమస్యలకు కనీస పరిష్కారం చూపలేదన్నారు. భేషజాలకు పోకుండా నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సీఎంను కోరారు.

Updated Date - Jul 15 , 2024 | 04:17 AM

Advertising
Advertising
<