ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA Conflict: రచ్చ.. రచ్చ!

ABN, Publish Date - Sep 13 , 2024 | 03:19 AM

పార్టీ ఫిరాయింపుపై రచ్చ రచ్చ! ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం! ఓ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఇంటికి పార్టీ మారిన మరో ‘బీఆర్‌ఎస్‌’ ఎమ్మెల్యే! అక్కడ హై టెన్షన్‌ వాతావరణం! ఆయన అరెస్టు.. విడుదల!

  • అరెకపూడి, కౌశిక్‌ రెడ్డి మధ్య జెండా జగడం

  • పార్టీ ఫిరాయింపులపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం

  • గాంధీ ఇంటికెళ్లి బీఆర్‌ఎస్‌ జెండా ఎగరేస్తానన్న కౌశిక్‌.. ఆయన విల్లాకు వెళ్లిన గాంధీ, ఆయన అనుచరులు

  • టమాటాలు, కోడిగుడ్లతో దాడి, కిటికీలు, కుండీలు ధ్వంసం.. ప్రతిగా చెప్పులు విసిరిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు

  • గంటన్నరపాటు హైటెన్షన్‌.. గాంధీ అరెస్టు, విడుదల.. సైబరాబాద్‌ కమిషనరేట్‌కు హరీశ్‌, కౌశిక్‌.. ఫిర్యాదు

  • గాంధీపై కేసు నమోదు చేయాలని బైఠాయింపు.. వారిని అరెస్టు చేసి కేశంపేట తీసుకెళ్లి వదిలిన పోలీసులు

  • ఇది ప్రభుత్వ దాడి.. పోలీసుల వైఫల్యం: హరీశ్‌రావు.. నేడు గాంధీ ఇంటిని ముట్టడిస్తాం: కౌశిక్‌

  • ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్న కౌశిక్‌: అరెకపూడి.. గాంధీ, అనుచరులపై కేసు నమోదు

హైదరాబాద్‌ సిటీ/మియాపూర్‌/ గచ్చిబౌలి/ హైదర్‌గూడ/ నార్సింగి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): పార్టీ ఫిరాయింపుపై రచ్చ రచ్చ! ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం! ఓ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఇంటికి పార్టీ మారిన మరో ‘బీఆర్‌ఎస్‌’ ఎమ్మెల్యే! అక్కడ హై టెన్షన్‌ వాతావరణం! ఆయన అరెస్టు.. విడుదల! సీనులోకి మరికొందరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు! సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయం వద్దా తీవ్ర ఉద్రిక్తత! అక్కడ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అరెస్టులు! వెరసి.. ఫిరాయింపులు, ‘జెండా వివాదం’ ఎమ్మెల్యేల మధ్య తీవ్రస్థాయి లొల్లికి దారి తీసింది! శేరిలింగంపల్లి రణరంగంగా మారింది. ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా ఇటీవల శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమించిన విషయం తెలిసిందే. అయితే, ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన ఆ పదవిని బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసి కొన్ని రోజుల కిందట కాంగ్రె్‌సలో చేరిన గాంధీకి ఎలా ఇస్తారని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి బుధవారం తీవ్రంగా స్పందించారు. ‘‘పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలకు సిగ్గు, శరం ఉంటే స్పీకర్‌ నిర్ణయానికి ముందే రాజీనామా చేయాలి. లేదంటే ఆ పది మందికి చీరలు, గాజులు కొరియర్‌ చేస్తా.. వేసుకొని తిరగండి’’ అని వ్యాఖ్యానించారు. తాను కాంగ్రె్‌సలో చేరినట్లు అప్పట్లో స్వయంగా చెప్పిన గాంధీ ఇప్పుడు దేవుడి కండువా కప్పుకొన్నానని మాట మారుస్తున్నాడని, ఆయన తమ పార్టీ సభ్యుడే అయితే తెలంగాణ భవన్‌కు రావాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే, గురువారం ఉదయం 11 గంటలకు ఆయన ఇంటికి వెళ్లి బీఆర్‌ఎస్‌ కండువా కప్పుతానని, ఆయన ఇంటిపై పార్టీ జెండా ఎగురవేసి, తెలంగాణ భవన్‌కు తీసుకెళ్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో, ఉదయం ఏడు గంటలకే కౌశిక్‌ ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయనను హౌజ్‌ అరెస్ట్‌ చేశారు.


  • గేటును విరగ్గొట్టి.. తలుపులు నెట్టి..

తన ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తానని కౌశిక్‌ రెడ్డి వ్యాఖ్యానించడంపై గురువారం ఉదయం అరెకపూడి గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. తన ఇంటి ముందు కుర్చీ వేసుకుని కూర్చుని మీడియాతో మాట్లాడారు. రాయలేని పదజాలంతో కౌశిక్‌ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ‘‘నేను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనని అసెంబ్లీలో స్పీకర్‌ ప్రకటించారు. కౌశిక్‌ రెడ్డిలాంటి కోవర్టులకు నా గురించి మాట్లాడే అర్హత లేదు. 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగుర వేస్తానన్నాడు. రాకపోతే 12 గంటలకు నేనే నీ ఇంటికి వస్తా. పార్టీలో చేరి భ్రష్టు పట్టించింది కాక పాత ముఖ్యమంత్రిని నాశనం చేశావు. కాంగ్రెస్‌ నుంచి కొంతమందిని తీసుకొచ్చి బీఆర్‌ఎ్‌సలో జాయిన్‌ చేస్తానని చెప్పావు. ఓ దుర్మార్గుడు నా ఇంటిపై జెండా ఎగరవేస్తానని అంటే ఊరుకుంటానా!? నా ఇంటిపై జెండా ఎగుర వేస్తానంటే ఎగుర వేయించుకునేందుకు సిద్ధంగా లేము. చేతులు కట్టుకుని కూర్చోలేదు. నువ్వో.. నేనో తేల్చుకుందాం.. ధైర్యం ఉంటే రా..! లేకపోతే నేనే వస్తా’’ అని సవాల్‌ విసిరారు. ఇది బీఆర్‌ఎ్‌సకు, తనకు మధ్య యుద్ధం కాదని, కౌశిక్‌కు తనకు మధ్యనని స్పష్టం చేశారు. ఎన్నికల్లో తనను గెలిపించకపోతే చనిపోతానని బ్లాక్‌ మెయిల్‌ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన కౌశిక్‌ రెడ్డిలాంటి కోవర్టులకు తన గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. కేసీఆర్‌కే తాను సమాధానం చెబుతానని, కౌశిక్‌ వంటి ఇజ్జత్‌ లేని వాళ్లకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పది నిమిషాల్లో రాకపోతే తానే కౌశిక్‌ ఇంటికి వెళతానని అన్నారు. అన్నట్లుగానే మధ్యాహ్నం 12 గంటలకు 20 వాహనాల కాన్వాయ్‌లో తన అనుచరులతో కొండాపూర్‌లోని కొల్లా విల్లా్‌సలో ఉంటున్న కౌశిక్‌ రెడ్డి ఇంటికి వెళ్లారు. దీంతో, కౌశిక్‌ ఇంటి వద్ద భద్రతను మరింత పెంచారు. మధ్యాహ్నం 12.30 గంటలలోపు కౌశిక్‌ రెడ్డి ఇంటికి గాంధీ, ఆయన అనుచరులు చేరుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాటలు, వాగ్వాదాలు జరిగాయి. కొంతమంది గేటును విరగ్గొట్టి, ప్రవేశ ద్వారానికి చెందిన తలుపులను తెరిచేందుకు ప్రయత్నించారు. విల్లాస్‌ బయట ఉన్న పెద్ద గేటును బద్దలు కొట్టి గాంధీ అనుచరులు లోపలికి వెళ్లారు. కానీ, వారు కౌశిక్‌ రెడ్డి దగ్గరకు వెళ్లనీయకుండా పోలీసులు కట్టడి చేశారు. అదే సమయంలో కౌశిక్‌, ఆయన అనుచరులపై గాంధీ అనుచరులు కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. కొంతమంది రాళ్లతో ఆయన ఇంటి కిటికీ అద్దాలు, పూలకుండీలు పగులకొట్టారు. దీనికి ప్రతిగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, కౌశిక్‌ రెడ్డి అనుచరులు వారిపై చెప్పులు విసిరారు. సైబరాబాద్‌ పోలీసులు ఎట్టకేలకు గాంధీని అరెస్ట్‌ చేసి నార్సింగి పోలీసు స్టేషన్‌కుతీసుకెళ్లారు. ఆ తర్వాత స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు.


  • కౌశిక్‌ వర్సెస్‌ పోలీసులు

కౌశిక్‌ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ మాజీ మంత్రులు హరీశ్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌, కౌశిక్‌ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌కు వెళ్లారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్‌ చేయాలంటూ కౌశిక్‌ రెడ్డి సైబరాబాద్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. బెడ్‌రూం కిటికీ బద్దలు కొట్టి తనపై దాడికి యత్నం చేశారని ఆరోపించారు. దాడికి యత్నించిన గాంధీ, ఆయన అనుచరులపై హత్యాయత్నం, దోపిడీ వంటి కేసులు నమోదు చేయాలని కోరారు. ఆ సమయంలో ప్రేక్షక పాత్ర పోషించిన మాదాపూర్‌ ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌, గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో, కౌశిక్‌ రెడ్డి, పోలీసుల నడుమ తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అడ్డుకోబోయిన పోలీసులపైకి వేలెత్తి చూపిన కౌశిక్‌ రెడ్డి.. జాగ్రత్త అంటూ హెచ్చరించారు. వెంటనే కలగజేసుకున్న హరీశ్‌ రావు.. ఆయనను సముదాయించి పక్కకు పంపించారు. అనంతరం ఆయన పోలీసులతో మాట్లాడారు. గాంధీ అనుచరులపై హత్యాయత్నం కేసు పెట్టాలని, వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇచ్చే వరకు ఇక్కడే ఉంటామని తేల్చి చెప్పారు. రాత్రి ఏడు గంటల వరకూ అక్కడే బైఠాయించారు. దాంతో, తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ కేసు నమోదు చేసిన పోలీసులు హరీశ్‌ రావు, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, వివేకానందతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.


  • అర్ధరాత్రి హరీశ్‌ బైఠాయింపు

అరెస్ట్‌ చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల తరలింపు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దాదాపు మూడు గంటలపాటు రంగారెడ్డి జిల్లాలో హైడ్రామా నడిచింది. వారిని తొలుత నాటకీయ పరిణామాల మధ్య తలకొండపల్లికి.. అక్కడి నుంచి కేశంపేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. తమను ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలంటూ హరీశ్‌ తదితరులు పోలీసు స్టేషన్లోనే బైఠాయించారు. వివాదానికి కారకుడైన గాంధీపై కేసు పెట్టి అరెస్ట్‌ చేసే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని భీష్మించారు. కాగా, తోపులాటలో హరీశ్‌ భుజానికి గాయమైంది. ఆయన చెయ్యి నొప్పితో బాధపడుతున్నట్లు కనిపించింది. చివరకు, డీజీపీ హామీతో హరీశ్‌ ఆందోళన విరమించారు. కేశంపేట పోలీసు స్టేషన్‌ నుంచి విడుదలైన తర్వాత హరీశ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. కౌశిక్‌ ఇంటిపై దాడి చేసిన వారిపై 307 కింద క్రిమినల్‌ కేసు పెడతామని డీజీపీ హామీ ఇచ్చారని, బేషరతుగా ఇంటికి వెళ్లాలని చెప్పారని, అందుకే ఆందోళన విరమించామని చెప్పారు. మరోవైపు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు మాగంటి గోపీనాథ్‌, బండారి లక్ష్మారెడ్డి, వివేకానంద, సంజయ్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారిలను మరో వాహనంలో తలకొండపల్లికి తీసుకొచ్చారు. అక్కడ భారీగా మోహరించిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నినాదాలు చేయడంతో 20 నిమిషాల అనంతరం తలకొండపల్లి నుంచి వారిని నగరం వైపు తీసుకెళ్లారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు అడుగడుగునా అడ్డుకోవడంతో అర్ధరాత్రి కేశంపేట, తలకొండపల్లిల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షాద్‌నగర్‌ బైపాస్‌ మీదుగా కేశంపేట్‌ తరలిస్తుండగా ఎక్లా్‌సఖాన్‌పేట వద్ద నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌ ఉన్న పోలీస్‌ వాహనాన్ని అడ్డుకొని ఆందోళన చేశారు. రోడ్డుకు అడ్డుగా జేసీబీ పెట్టి పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. వాహనం అద్దాలను పగులగొట్టారు.


  • గాంధీ, అనుచరులపై కేసు నమోదు

కౌశిక్‌ రెడ్డి ఇంటిపై దాడి కేసులో గచ్చిబౌలి పోలీసులు ఎమ్మెల్యే గాంధీ, ఆయన అనుచరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిలో గాంధీని ఎ-1గా పేర్కొన్నారు. గాంధీతోపాటు కార్పొరేటర్లు, కార్యకర్తలు 30 మందిపై కౌశిక్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 1392/2024 నమోదు చేశారు. 189, 191(2), 191(3). 61, 132, 329, 111, 324(4), 324(5), 351(2), ఆర్‌-డబ్ల్యూ 190 డీఎన్‌ఎ్‌స సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎ2గా మియాపూర్‌ కార్పొరేటర్‌ శ్రీకాంత్‌, ఎ3గా బి.గౌతంగౌడ్‌, ఎ4 రాంపల్లి వెంకటేష్‌, ఎ5 జి.రాములు, ఎ6 నరేష్‌, ఎ7 శివ, ఎ8 రాధిక, ఎ9 మంజుల, ఎ10 చంద్రికగౌడ్‌, ఎ11 కార్పొరేటర్‌ రాగం నాగేందర్‌యాదవ్‌, ఎ12 బి.వెంకటేష్‌ గౌడ్‌, ఎ13 అష్రఫ్‌, ఎ14 రఘునాథ్‌రెడ్డి, ఎ15 మోహన్‌ గౌడ్‌తోపాటు పలు వీడియోలు పరిశీలించి దాడిలో పాల్గొన్న పలువురిని గుర్తించి 30 మందిపై కేసు నమోదు చేశారు.. మారింది. ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా ఇటీవల శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమించిన విషయం తెలిసిందే. అయితే, ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన ఆ పదవిని బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసి కొన్ని రోజుల కిందట కాంగ్రె్‌సలో చేరిన గాంధీకి ఎలా ఇస్తారని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి బుధవారం తీవ్రంగా స్పందించారు. ‘‘పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలకు సిగ్గు, శరం ఉంటే స్పీకర్‌ నిర్ణయానికి ముందే రాజీనామా చేయాలి. లేదంటే ఆ పది మందికి చీరలు, గాజులు కొరియర్‌ చేస్తా.. వేసుకొని తిరగండి’’ అని వ్యాఖ్యానించారు. తాను కాంగ్రె్‌సలో చేరినట్లు అప్పట్లో స్వయంగా చెప్పిన గాంధీ ఇప్పుడు దేవుడి కండువా కప్పుకొన్నానని మాట మారుస్తున్నాడని, ఆయన తమ పార్టీ సభ్యుడే అయితే తెలంగాణ భవన్‌కు రావాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే, గురువారం ఉదయం 11 గంటలకు ఆయన ఇంటికి వెళ్లి బీఆర్‌ఎస్‌ కండువా కప్పుతానని, ఆయన ఇంటిపై పార్టీ జెండా ఎగురవేసి, తెలంగాణ భవన్‌కు తీసుకెళ్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో, ఉదయం ఏడు గంటలకే కౌశిక్‌ ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయనను హౌజ్‌ అరెస్ట్‌ చేశారు.


  • నీ కాలనీకొచ్చా.. నీ ఇంటికొచ్చి.. అరికెపూడి గాంధీ

కౌశిక్‌ రెడ్డి గేటెడ్‌ కమ్యూనిటీలోకి వెళుతున్నప్పుడు మధ్యలో ఎమ్మెల్యే గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన అక్కడే బైఠాయించి కౌశిక్‌పై మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. తన ఇంటికి వస్తానని చాలెంజ్‌ చేసిన కౌశిక్‌ రెడ్డి రాలేకపోయాడని, తానే ఆయన ఇంటికి వచ్చానని చెప్పారు. ‘‘దమ్ము, ధైర్యం ఉంటే బయటకు రా. నీ ఇంటికి వచ్చా.. నీ కాలనీకి వచ్చా’’ అని మరోసారి సవాల్‌ విసిరారు. పోలీసులు అరెస్ట్‌ చేసిన తర్వాత కూడా ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎ్‌సలోకి వచ్చినప్పటి నుంచీ కౌశిక్‌ రెడ్డి తీరు సరిగా లేదని, ఆయన తీరు వల్లే ఆ పార్టీ ఓటమి పాలైందని విమర్శించారు. ఆయన పెద్ద కోవర్టు అని.. పార్టీలో జరిగిన అంతర్గత చర్చలను బాత్‌ రూమ్‌కు వెళ్లి వేరే వారికి చెప్పేవాడని ఆరోపించారు. తెలంగాణ, ఆంధ్రా అంటూ మళ్లీ ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నాడని ధ్వజమెత్తారు. విద్వేషాలు సృష్టిస్తున్న అతడిని తక్షణమే సస్పెండ్‌ చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీని డిమాండ్‌ చేశారు. కౌశిక్‌ రెడ్డి భార్య స్వయంగా విల్లాపై నుంచి తమపై పూల కుండీలు తదితరాలను విసిరారని ఆరోపించారు. కౌశిక్‌ పిలిస్తేనే తాను వెళ్లానని, అక్కడ తమను 30 మంది అతని అనుచరులు అడ్డుకున్నారని, రాళ్ల దాడి చేశారని ఆరోపించారు.


  • కౌశిక్‌రెడ్డి ఫొటోలను తగలబెట్టిన కాంగ్రెస్ నేతలు

హుజూరాబాద్‌/బంజారాహిల్స్‌: అరికెపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి మధ్య వివాదం.. తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తతకు దారి తీసింది. కౌశిక్‌రెడ్డి వాఖ్యలను నిరసిస్తూ కాంగ్రె్‌స మహిళా నాయకులు తెలంగాణ భవన్‌ వద్దకు చేరుకొని ఆయన ఫొటోలను దహనం చేశారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. తోపులాట జరిగింది. కౌశిక్‌రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలని టీపీసీసీ మహిళా విబాగం నాయకురాలు కాల్వ సుజాత డిమాండ్‌ చేశారు. కాగా, కౌశిక్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్‌లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు రోడ్లపైకి రాకుండా ఇళ్లకే పరిమితం చేశారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ నాయకులు అంబేద్కర్‌ చౌరస్తా వద్దకు వచ్చేందుకు ప్రయత్నించగా కాంగ్రెస్‌ కార్యాలయం వద్దనే వారిని పోలీసులు అడ్డుకున్నారు.


  • బతకడానికొచ్చిన ఆంధ్రోళ్లు: కౌశిక్‌రెడ్డి

తన ఇంటిపై గాంధీ అనుచరులు దాడి చేయడంతో ఆంధ్ర, తెలంగాణ అంశాన్ని కౌశిక్‌ రెడ్డి తెరపైకి తెచ్చారు. బతకడానికి వచ్చిన ఆంధ్రోళ్లు తెలంగాణ బిడ్డలపై దాడి చేస్తే ఊరుకునేది లేదని, తెలంగాణ పౌరుషం ఏమిటో శుక్రవారం చూపిస్తామని హెచ్చరించారు. నాలుగేళ్ల తర్వాత కేసీఆర్‌ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు నీ భరతం పడతానని, సినిమా చూపిస్తానని గాంధీని హెచ్చరించారు. కాగా, కౌశిక్‌ రెడ్డి హెచ్చరికల నేపథ్యంలో గాంధీ ఇంటి వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత, బారికేడ్లు ఏర్పాటు చేశారు.


  • పోలీసుల వైఫల్యం వల్లే దాడి: హరీశ్‌రావు

పోలీసుల వైఫల్యం వల్లే కౌశిక్‌ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు. గాంధీ, ఆయన అనుచరులు కౌశిక్‌ రెడ్డి ఇంటిపై దాడి చేశారన్న వార్తలు తెలుసుకుని పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన నివాసానికి చేరుకున్నారు. అక్కడ, సీపీ ఆఫీసు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. మీరు ఒకటి చేస్తే తాము రెండు చేయగలమని హెచ్చరించారు. పైలట్‌, ఎస్కార్ట్‌ ఇచ్చి మరీ గాంధీని కౌశిక్‌ రెడ్డి ఇంటిపై దాడికి పంపారని, ఈ చర్యను ఖండిస్తున్నామని అన్నారు. తమ ఎమ్మెల్యేను కాంగ్రె్‌సలోకి చేర్చుకోవడమే కాకుండా... వారిని ఉసిగొల్పి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై దాడి చేయించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. కౌశిక్‌ రెడ్డికి సీఎం రేవంత్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనకు కారణమైన అధికారులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ‘‘హైదరాబాద్‌ ఇమేజ్‌ దెబ్బతినవద్దని కోరుకుంటున్నాం. గతంలో తెలంగాణ పోలీసులు దేశానికి రోల్‌ మోడల్‌గా ఉన్నారు. రేవంత్‌ ప్రభుత్వం పోలీసులను వారి పని వారిని చేసుకోనివ్వడం లేదు. కౌశిక్‌ ఇంటిపై దాడి చేసిన గాంధీ, ఆయన అనుచరులపై 307 సెక్షన్‌ కింద కేసులు నమోదు చేయాలి. లేదంటే సీబీఐ విచారణ కోరతాం. అవసరమైతే కోర్టుకు వెళ్తాం.. కేంద్ర హోం శాఖ వద్దకు వెళ్తాం’’ అని స్పష్టం చేశారు. రేవంత్‌ రెడ్డి డైరెక్షన్లో పోలీసుల ఆధ్వర్యంలో దాడి జరిగిందని, పాత్రధారులు, సూత్రధారులను తేల్చేందుకు విచారణ చేపట్టాలన్నారు. పదేండ్ల కేసీఆర్‌ పాలనలో హైదరాబాద్‌ను కంటికి రెప్పలా కాపాడుకున్నామని, సైబరాబాద్‌ పరిధిలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని చెప్పారు. ‘‘రేవంత్‌.. నిన్ను హెచ్చరిస్తున్నా.. దాడి చేసిన గూండాలను అరెస్ట్‌ చెయ్‌.. వారికి సహకరించిన పోలీసులపై యాక్షన్‌ తీసుకో.. లేకపోతే ఢిల్లీకి వెళ్లి రాహుల్‌ గాంధీ ఇంటి ముందు, ఏఐసీసీ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం’’అని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పాలనలో ఎమ్మెల్యేలను ఎలా కొంటున్నరో దేశం మొత్తం తెలిసేలా చేస్తామన్నారు. కాంగ్రె్‌సకు ప్రతిపక్ష హోదా లేకపోవడంతోనే 2018లో ప్రతిపక్ష హోదా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కి పీఏసీ చైర్మన్‌ ఇచ్చామని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్‌ను అడగకుండా, ఎన్నిక లేకుండా నియమించడం దుర్మార్గమన్నారు. ‘‘పార్లమెంట్‌లో కేసీ వేణుగోపాల్‌ని పీఏసీ చైర్మన్‌గా ఎన్నుకున్నప్పుడు రాహుల్‌ను అడిగి చేయలేదా!? అదే పద్ధతిలో ఇక్కడా ప్రతిపక్ష నాయకుడిని అడగాలి కదా!’’ అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని రేవంత్‌ ప్రయత్నిస్తున్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సమాజంపై దాడి చేస్తే ఊరుకోబోమని, రేవంత్‌ రెడ్డి భయపెడితే భయపడమని అన్నారు.


  • నేడు వందలాదిమందితో గాంధీ ఇంటి ముట్టడి: కౌశిక్‌

చర్యకు తప్పకుండా ప్రతి చర్య ఉంటుందని, శుక్రవారం ఉదయం 11 గంటలకు వందలాది మందితో గాంధీ ఇంటిని ముట్టడించి తీరతామని, తెలంగాణ పౌరుషాన్ని చూపిస్తామని కౌశిక్‌ రెడ్డి ప్రకటించారు. ‘‘గాంధీని సాదరంగా ఆహ్వానించి, ఇంట్లోకి తీసుకెళ్లి భోజనం పెడదామని భావించాను. ఆయన రౌడీ షీటర్లతో దాడికి పాల్పడ్డాడు. నన్ను హత్య చేయాలని చూశారు. అయినా, పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. అసలు తెలంగాణలో శాంతి భద్రతలు ఉన్నాయా లేవా!?’’ అని ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యేకే రక్షణ ఇవ్వకుంటే.. ఇక సాధారణ ప్రజలకు ఏం ఇస్తారని నిలదీశారు. గాంధీపై పరుష పదజాలంతో దూషించారు. ఆయన టీడీపీని మోసం చేసి బీఆర్‌ఎ్‌సలో.. ఆ పార్టీని మోసం చేసి కాంగ్రె్‌సలో చేరారని, ఇప్పుడు పీఎసీ చైర్మన్‌ కాగానే బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నానని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. గాంధీ చరిత్ర నీచమైనదని విమర్శించారు. ‘‘గాంధీగారూ.. నేను వయసులో ఉన్నా. యువకుడిని.. నేను రెచ్చిపోతే ఎలా ఉంటుందో చూస్కో.. నాకు 39, నీకు 65.. లేదు.. తన్నుకుందాం అంటే ఐయామ్‌ రెడీ! దమ్ముంటే చూసుకుందాం రా’’ అని సవాల్‌ విసిరారు. కోట్లకు అమ్ముడుపోయారని, భూ సెటిల్‌మెంట్ల కోసమే కాంగ్రెస్‌ గూటికి వెళ్లారని ఆరోపించారు. ధైర్యముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవాలని, ఎవరి సత్తా ఏమిటో తెలిసిపోతుందని సవాల్‌ చేశారు. ‘‘శుక్రవారం ఉదయం శంభీపూర్‌ రాజు ఇంటి నుంచి గ్రేటర్‌లోని ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతో గాంధీ ఇంటికి వెళ్తాం. బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నానని ఆయన అంటున్నందుకే వెళుతున్నాం. అక్కడే బ్రేక్‌ఫాస్ట్‌.. లంచ్‌ చేస్తాం.. అక్కడి నుంచి గాంధీని తెలంగాణ భవన్‌కు, కేసీఆర్‌ దగ్గరకు తీసుకెళ్తాం’’ అని వివరించారు.


  • ఇందిరమ్మ రాజ్యంలో ఎమ్మెల్యేకు రక్షణ ఉండదా?:కేటీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): పట్టపగలు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి హత్యాయత్నం చేశారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏమైనట్లు? ఇందిరమ్మ రాజ్యంలో ఎమ్మెల్యేకు రక్షణ ఉండదా? అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. పోలీసుల సాయంతో అరికెపూడి గాంధీతోపాటు మరికొందరు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఇది సీఎం రేవంత్‌రెడ్డి చేయించిన దాడేనని ‘ఎక్స్‌’ వేదికగా ఆరోపించారు. అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తానన్న కౌశిక్‌రెడ్డిని గృహనిర్భంధంలో ఉంచిన పోలీసులు.. గాంధీని మాత్రం కౌశిక్‌రెడ్డి ఇంటి వద్దకు ఎలా అనుమతించారని నిలదీశారు. కాంగ్రెస్‌ అరాచకాలను కచ్చితంగా రాసి పెట్టుకుంటామని, తాము అధికారంలోకి ఆ పార్టీ నేతలు ఇంతకుమించిన ప్రతిఘటన ఎదుర్కొంటారని హెచ్చరించారు.


  • సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే యత్నం: ఆది శ్రీనివాస్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ద్వారా తెలంగాణ సెంటిమెంట్‌ను రొచ్చగొట్టడానికి బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ విమర్శించారు. ఆంధ్రా సెటిలర్లు బతకడానికి వచ్చారంటూ అవమానించేలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రా సెటిలర్లే బీఆర్‌ఎస్‌ పరువు కాపాడారని, కానీ.. వారి విషయంలో ఆ పార్టీ నిజస్వరూపమేంటో నేడు బయటపడిందన్నారు. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను కేసీఆర్‌ సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించారు. లేదంటే తక్షణమే ఆయనను బీఆర్‌ఎస్‌ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. గాంధీ పదేళ్లుగా బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నారని, ఆయన ఆంధ్రా వ్యక్తి అని అప్పుడు తెలియదా? అని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ ప్రశ్నించారు. తెలంగాణ అంతా కలిసి ఉండాలని బీఆర్‌ఎస్‌ భావిస్తే కౌశిక్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ డిమాండ్‌ చేశారు.


  • అక్బరుద్దీన్‌ ఒవైసీకి బీఏసీ చైర్మన్‌ ఎలా ఇచ్చారు?: ఎమ్మెల్యే దానం

నార్సింగ్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో అక్బరుద్దీన్‌ ఒవైసీకి బీఏసీ చైర్మన్‌ ఎలా ఇచ్చారో సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీని మట్టుబెట్టాలని కేసీఆర్‌ ప్రయత్నించారని, ఇప్పుడు అదే కాంగ్రెస్‌ అధికారంలో ఉందన్నారు. బీఏసీ చైర్మన్‌ ఎంపిక విషయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ పనికిరాని రాజకీయాలు మానుకోవాలని, లేదంటే తమ తడాకా చూపుతామని హెచ్చరించారు. ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. కౌశిక్‌ రెడ్డి హుందాగా ప్రవర్తించే నాయకుడిగా ఉండాలని, చాలెంజ్‌ చేస్తూ వెళితే హైదరాబాద్‌లో ఉండలే వన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, బీఏసీ చైర్మన్‌ అరికపూడి గాంధీని గురువారం ముందుస్తు అరెస్టు చేసి నార్సింగ్‌ పోలీస్టేషన్‌కు తరలించారు. ఆయనకు మద్దతుగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన సందర్భంగా దానం, అనిల్‌ కుమార్‌ మాట్లాడారు.

Updated Date - Sep 13 , 2024 | 03:19 AM

Advertising
Advertising