ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponguleti Srinivas Reddy: నూతన రైల్వేలైన్ల అలైన్‌మెంట్‌ మార్చండి

ABN, Publish Date - Aug 08 , 2024 | 03:30 AM

దక్షిణ మధ్య రైల్వే ఖమ్మం, వరంగల్‌ జిల్లాల మీదుగా ప్రతిపాదించిన నూతన రైలు మార్గాల్లో మార్పులు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు.

  • దక్షిణమధ్య రైల్వే జీఎంతో మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వే ఖమ్మం, వరంగల్‌ జిల్లాల మీదుగా ప్రతిపాదించిన నూతన రైలు మార్గాల్లో మార్పులు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు బుధవారం రైల్‌ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌తో మంత్రి పొంగులేటి సమావేశమై రైల్వేలైన్ల మార్పులపై చర్చించారు. డోర్నకల్‌ నుంచి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెం మీదుగా సూర్యాపేట జిల్లా మోతే నుంచి గద్వాల్‌ వరకు ప్రతిపాదించిన నూతన రైల్వే మార్గం పాలేరులోని నాలుగు మండలాల మీదుగా వెళుతుండడంతో రైతులు సాగు భూములను కోల్పోవాల్సి వస్తుందని మంత్రి వివరించారు.


ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్ల కాకతీయ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(కుడా) మాస్టర్‌ ప్లాన్‌ను పరిగణనలోకి తీసుకొని వరంగల్‌ నగర బైపాస్‌ రైల్వేలైన్‌ను నిర్మించాలని కోరారు. నష్కల్‌ నుంచి హసన్‌పర్తి, నష్కల్‌ నుంచి చింతలపల్లి వరకు కొత్తగా నిర్మించ తలపెట్టిన రైల్వే మార్గాన్ని వరంగల్‌ మాస్టర్‌ ప్లాన్‌కు అనుసంధానం చేయాలని కోరారు. ప్రస్తుతం సిద్ధం చేసిన రైల్వే మార్గం వల్ల వరంగల్‌ మాస్టర్‌ ప్లాన్‌ దెబ్బతింటుందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని అలైన్‌మెంట్‌ మార్చాలని మంత్రి పొంగులేటి విజ్ఞప్తి చేశారు.

Updated Date - Aug 08 , 2024 | 03:30 AM

Advertising
Advertising
<