TG Politics: జితేందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి అందుకే పార్టీ మారారు.. బీజేపీ నేత రఘునందనరావు కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Mar 18 , 2024 | 08:05 PM
సొంత అవసరాల కోసం కొంతమంది నేతలు పార్టీలు మారుతున్నారని బీజేపీ సీనియర్ నేత రఘునందనరావు (Raghunandan Rao) అన్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కొడుకుకు టికెట్ ఇస్తే బీజేపీలో ఉండేవారని...టికెట్ ఇవ్వకపోతే పార్టీ మంచిది కాదా అని ప్రశ్నించారు.
హైదరాబాద్: సొంత అవసరాల కోసం కొంతమంది నేతలు పార్టీలు మారుతున్నారని బీజేపీ సీనియర్ నేత రఘునందనరావు (Raghunandan Rao) అన్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కొడుకుకు టికెట్ ఇస్తే బీజేపీలో ఉండేవారని...టికెట్ ఇవ్వకపోతే పార్టీ మంచిది కాదా అని ప్రశ్నించారు. సోమవారం నాడు బీజేపీ (BJP) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి ఏం లాభం చేకూర్చునేందుకు కాంగ్రెస్ పార్టీలోకి జితేందర్, రంజిత్ రెడ్డి వెళ్తున్నారని ప్రశ్నించారు. వీరిద్దరూ కాంగ్రెస్ (Congress)కు వెళ్లడం ద్వారా వెనుక జరిగిన ఆర్థిక లావాదేవీలు ఏంటని నిలదీశారు. వారి ఆర్థిక ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు ఏంటని ప్రశ్నించారు.
తమకు అన్ని తెలుసునని అన్ని సమాచారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. బీఆర్ఎస్ ద్వారా ఎంపీ రంజిత్ రెడ్డి అందరి కంటే ఎక్కువ లబ్ధి పొందారన్నారు. షేక్‌పేటలో సర్వే నంబర్ 443, 403లలో జరుగుతున్న భూ భాగోతలపై ఈడీ, ఐటీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని తెలిపారు. జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి పార్టీ మారడం వెనుక వందల కోట్లు చేతులు మారుతున్నాయన్నారు. ఆ డబ్బులతో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేవారికి ఫండింగ్ చేయబోతున్నారని రఘునందనరావు అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 18 , 2024 | 08:05 PM