ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Railways: జనరల్‌లో ఎక్కితే చుక్కలే..!

ABN, Publish Date - Aug 04 , 2024 | 05:20 AM

వ్యాపారమే పరమావధిగా మారిపోయిన రైల్వేకు పేదల ఇబ్బందులు పట్టడం లేదు. లాభార్జన కోసం జనరల్‌ బోగీలను కుదించడంతో సామాన్య ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. స్లీపర్‌ కోచ్‌లను కూడా రెట్టింపు సంఖ్యలో కుదించేయడంతో పరిస్థితి అదుపు తప్పింది.

  • రైళ్లలో ప్రయాణం సామాన్యులకు నరకం

  • సరిపడా జనరల్‌ బోగీలు లేక జనం విలవిల

  • కిక్కిరిసిన బోగీల్లో ప్రమాదకరంగా ప్రయాణం

  • పెరుగుతున్న గొడవలు, కొట్లాటలు

  • గతంలో 4 జనరల్‌ బోగీలు.. ఇప్పుడు ఒక్కటే

    (విజయవాడ-ఆంధ్రజ్యోతి): వ్యాపారమే పరమావధిగా మారిపోయిన రైల్వేకు పేదల ఇబ్బందులు పట్టడం లేదు. లాభార్జన కోసం జనరల్‌ బోగీలను కుదించడంతో సామాన్య ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. స్లీపర్‌ కోచ్‌లను కూడా రెట్టింపు సంఖ్యలో కుదించేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. కరోనా తర్వాత నుంచి కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా రైల్వే సామాన్యుడికి దూరమవుతూ వస్తోంది. ఓ పథకం ప్రకారం రైల్వేను ప్రైవేటుపరం చేయడానికి కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో విజయవాడ రైల్వే పరిధిలోనూ సామాన్య ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి.


పాసింజర్ల రైళ్లను ఎక్స్‌ప్రె్‌సలుగా మార్చేయడం, జనరల్‌ బోగీలను నాలుగు నుంచి దశలవారీగా ఒక్క బోగీకి తీసుకురావడం, స్లీపర్‌ కోచ్‌లు 15 నుంచి 5కు పరిమితం చేయడం చేస్తున్నారు. ఏసీ బోగీల సంఖ్యను రెండు, మూడు రెట్లు పెంచుకుంటూ పోతున్నారు. రైళ్లలో సింహభాగం పేద, మధ్య తరగతి వర్గాలే ప్రయాణిస్తుంటారు. కానీ, ధనిక వర్గాలకే ప్రాధాన్యమిచ్చేలా ఏసీ బోగీలను పెంచడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


  • ఇసకేస్తే రాలనంత జనం..

విజయవాడ డివిజన్‌ పరిధిలో ఏ రైలు చూసినా ఒకే ఒక్క జనరల్‌ బోగీ, ఐదు స్లీపర్‌ కోచ్‌లు ఉంటున్నాయి. ఇవి సామాన్యులకు సరిపోవట్లేదు. పోనీ కోచ్‌ల్లో ప్రయాణికులు సరిపడా టికెట్లు ఇస్తున్నారా అంటే అదీ లేదు. పరిమితిని మించి టికెట్లు జారీ చేస్తున్నారు. దీనికితోడు టికెట్‌ తీసుకోని వారు కూడా జనరల్‌ బోగీల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో ఉన్న ఒకే ఒక్క జనరల్‌ బోగీలో ఇసకేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. సీట్ల కోసం గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. టాయ్‌లెట్స్‌ వరకు కూడా కూర్చుని ప్రయాణిస్తున్నారు. ఆఖరుకు సీట్ల దగ్గర కాళ్లు పెట్టుకునే ప్రాంతంలో కూడా కూర్చోవాల్సి వస్తోంది.

Updated Date - Aug 04 , 2024 | 05:20 AM

Advertising
Advertising
<