కీసరగుట్ట ఆలయ చైర్మన్‌గా నాగలింగంశర్మ
ABN , Publish Date - Jan 07 , 2024 | 12:28 AM
కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్‌గా తటాకం నాగలింగంశర్మ ప్రమాణస్వీకారం చేశారు.

కీసర, జనవరి 6: కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్‌గా తటాకం నాగలింగంశర్మ ప్రమాణస్వీకారం చేశారు. ఆలయ మహామండపంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, ఎమ్మెల్యే చామకూరమల్లారెడ్డిలు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లారపు ఇందిర లక్ష్మీ నారాయణ, ప్రభాకర్‌రెడ్డి, సత్తిరెడ్డి, మాధురి, లక్ష్మణ్ శర్మ పాల్గొన్నారు.
తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే
మేడ్చల్ టౌన్: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో మంచినీటి సమస్య పరిష్కారానికి తగినచర్యలు తీసుకున్నామని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని గ్రాండ్ వ్యూ-1లో హెచ్‌ఎంటీ బీఎస్ నుంచి మంచినీటి పైప్‌లైన్ పనులను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివా్‌సరెడ్డి, కౌన్సిలర్లు సరస్వతి, మల్లికార్జున్, జైపాల్‌రెడి పాల్గొన్నారు.