Teacher Beats Students: ప్రభుత్వ పాఠశాలలో దారుణం.. బయటపడ్డ పీఈటీ అరాచకం
ABN , Publish Date - Mar 07 , 2025 | 11:12 AM
Teacher Beats Students: కీసర ప్రభుత్వ స్కూల్లో పీఈ టీచర్ అరాచకం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినిల పట్ల టీచర్ ప్రవర్తించిన తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మేడ్చల్ జిల్లా, మార్చి 7: పాఠశాల అంటే దేవాలయం. గురువును దైవంతో భావిస్తుంటారు. స్కూళ్లల్లో విద్యార్థులకు ఉపాధాయులు చెప్పే మంచి మాటలే రేపటి వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తుంటాయి. విద్యార్థులు చదువుకోకుండా శృతి మించి అల్లరి చేస్తే వారిని దండిచడంలో తప్పులేదు. కానీ ఇప్పుడున్న కొందరు టీచర్లు చీటికి మాటికి పిల్లలను చావబాతున్నారు. టీచర్లకు ఓపిక, సహనం అనేది ముఖ్యం. చిన్నారులతో ఎంతో ఓపికతో విద్యా బుద్ధులు నేర్పించాల్సి ఉంటుంది. అయితే కొంత మంది టీచర్లు వాటిని పక్కనపెట్టి విద్యార్థుల పట్ల ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు.
హోంవర్క్ రాయలేదని, తరగతి గదిలో అల్లరి చేస్తున్నారంటూ ఇలా వివిధ కారణాలతో స్టూడెంట్స్‌ను శిక్షిస్తున్నారు. ఇలాంటి ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. విద్యార్థినుల పట్ల పీఈటీ ప్రవర్తించిన తీరు బాధాకరంగా ఉంది. వారిని విచక్షణమరిచి కొట్టడం సంచలనంగా మారింది. అసలు విద్యార్థులను పీఈటీ ఎందుకు కొట్టారు... దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇదీ విషయం...
కీసర ప్రభుత్వ పాఠశాలలో పీఈటీ ఆనంద్ అరాచకం వెలుగులోకి వచ్చింది. ఒంట్లో బాగాలేదన్నా వినకుండా 8 మంది విద్యార్థినిలను చితకబాదాడు పీఈటీ. గేమ్స్ పీరియడ్‌లో ఆటలాడేందుకు రాలేదనే కారణంగా ఆ విద్యార్థినిల పట్ల కర్కషంగా ప్రవర్తించాడు పీఈటీ. వారి ఏకంగా కరెంట్ వైర్‌తో చితకబాదాడు. 8వ తరగతి చదువుతున్న ప్రణతి, వైశాలి, కావ్య, నవ్య, చరన్య, అర్చన, బ్లేస్సి, కీర్తనలను పీఈటీ దారుణంగా కొట్టాడు. కొట్టొద్దని విద్యార్థినిలు వేడుకున్నప్పటికీ సదరు పీఈటీ వినిపించుకోలేదు. తీవ్రమైన దెబ్బలతో ఇంటికి చేరుకున్న ఆ ఎనిమిది మంది విద్యార్థినిలు స్కూల్లో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. అయితే కరెంట్ వైర్‌తో కొట్టడంతో విద్యార్థులకు జ్వరం బారిన పడ్డారు. ఉన్నట్టుండి వారికి జ్వరం రావడంతో అనుమానించిన తల్లిదండ్రులు వారి ఒంటిపై చూడగా.. గాయాలను చూసి పేరెంట్స్ షాక్‌కు గురయ్యారు.
Telangana RTC: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్
అసలేం జరిగిందనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. దీంతో పీఈటీ అరాచకం బయటపడింది. ఆడపిల్లలను కరెంట్ వైర్‌తో కొట్టడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విద్యార్థినిల తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరి ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న పీఈటీ ఆనంద్ స్కూల్‌కు డుమ్మా కొట్టేశాడు. ఈ ఘటనపై జిల్లా విద్యాధికారి స్పందించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆందోళనతో స్కూల్ వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తమ పిల్లలను చితకబాదిన పీఈటీపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినిల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
Janasena leaders criticize Ambati: వైసీపీ పాకిస్థాన్.. కూటమి ఇండియా.. జనసేన నేతల ఫైర్
CBI: వివేకా వాచ్‌మన్ రంగయ్య మృతిపై కేసు నమోదు
Read Latest Telangana News And Telugu News