ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Assistant Professor: త్వరలోనే 607 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ

ABN, Publish Date - Jul 11 , 2024 | 04:36 AM

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 607 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నేడో, రేపో మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న 8 వైద్య కళాశాలలకే 200 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు అవసరం.

హైదరాబాద్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 607 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నేడో, రేపో మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న 8 వైద్య కళాశాలలకే 200 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు అవసరం. దీంతో ఆ వైద్య కళాశాలల్లోని ఖాళీల భర్తీపైనా సర్కారు దృష్టి సారించింది. విద్యా సంవత్సరం మొదలయ్యేలోగా అన్ని ఖాళీలను భర్తీ చేయాలని ఆరోగ్యశాఖను ఆదేశించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 607 ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ పోస్టులన్నిటిని వైద్య, ఆరోగ్య సర్వీసుల రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు.


కాగా, ప్రజారోగ్య సంచాలకుల పరిఽధిలోని ఆస్పత్రుల్లో 435 ఎంబీబీఎ్‌స(సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌)పోస్టుల భర్తీకి ఇటీవల మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ నోటిఫికేషన్‌కు బుధవారం ఉదయం వరకు 2400 దరఖాస్తులొచ్చినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. గురువారం సాయంత్రానికి దరఖాస్తుల గడువు ముగియనుంది. చివరి రోజు మరో వెయ్యి దరఖాస్తుల వరకూ వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Jul 11 , 2024 | 04:36 AM

Advertising
Advertising
<