ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీనియర్‌ రచయిత కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌ కన్నుమూత

ABN, Publish Date - Dec 19 , 2024 | 05:00 AM

ప్రముఖ కథా, నవలా రచయిత, సాహిత్య వాచస్పతిగా పాఠకలోకం అభిమానాన్ని పొందిన కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌(78) ఇకలేరు. కొద్దిరోజులుగా నరాల సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయ న బుధవారం తెల్లవారుజామున విజయవాడలోని స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు.

  • 600దాటి కథానికలు, 400కుపైగా ఆధ్యాత్మిక వ్యాసాలు

  • 1965, 71 నాటి భారత్‌ పాక్‌ యుద్ధంలో పాల్గొన్న కాటూరు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు18(ఆంధ్రజ్యోతి): ప్రముఖ కథా, నవలా రచయిత, సాహిత్య వాచస్పతిగా పాఠకలోకం అభిమానాన్ని పొందిన కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌(78) ఇకలేరు. కొద్దిరోజులుగా నరాల సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయ న బుధవారం తెల్లవారుజామున విజయవాడలోని స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. రవీంద్ర త్రివిక్రమ్‌ పుట్టిన రోజునాడే మరణించడం యాదృచ్ఛికం. ఆయన స్వస్థలం విజయవాడలోని కాటూరువారి వీధి. రవీంద్ర త్రివిక్రమ్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1955లో ఆయన రచనా వ్యాసంగం ప్రారంభించారు. కథ, కథానిక, నవల, నవలిక, హరికథ, గేయ రచన, నాటకం, వ్యాసాలు తదితర ప్రక్రియల్లో సాహిత్య సృజన చేశారు. 600కుపైగా కథలు, కథానికలు, 400కుపైగా ఆధ్యాత్మిక వ్యాసాలు రాశారు.


‘యుగ పురుషుడు గురుగోబింద్‌ సింగ్‌’ జీవిత చరిత్ర, ‘శివగీతామృతం’ తదితర ఆధ్యాత్మిక గ్రంథాలతో పాటు ‘వడ్డీకాసులు’, ‘కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌ కథానికలు’ పేరుతో పుస్తకాలుగా వెలువడ్డాయి. కార్గిల్‌ పోరాటాన్ని కళ్లకు కడుతూ రవీంద్ర త్రివిక్రమ్‌ రాసిన ‘కార్గిల్‌ కథలు’ ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. వందకుపైగా నాటకాలు ఆకాశవాణిలో, మరికొన్ని నాటికలు దూరదర్శన్‌లో ప్రసారమయ్యాయి. ‘జురాహామ’(మహారాజు) హాస్యనాటికకు రవీంద్ర త్రివిక్రమ్‌ జాతీయస్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. కాటూరు భారత వైమానిక దళంలో ఇంజనీరుగా 16ఏళ్లు సేవలందించారు. 1965, 71 నాటి భారత్‌ పాక్‌ యుద్ధంలో పాల్గొన్నారు. కాటూరు అంత్యక్రియలు బంధు,మిత్రుల అశ్రునయనాల మధ్య బుధవారం సాయంత్రం విజయవాడలో ముగిశాయి.

Updated Date - Dec 19 , 2024 | 05:00 AM