ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Yadadri: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి దుర్మరణం.

ABN, Publish Date - May 28 , 2024 | 05:14 AM

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి చెందింది. ఈ ఘటన అట్లాంటా నగరంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని యాదగిరిపల్లికి చెందిన గుడ్ల కోటేశ్వర్‌రావు, బాలమణి దంపతులు కిరాణ దుకాణం నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నారు.

  • కూరగాయలకు వెళ్లినప్పుడు ఢీకొట్టిన కారు

  • యాదాద్రి జిల్లా యాదగిరిపల్లిలో విషాదం

యాదగిరిగుట్ట రూరల్‌, మే 27: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి చెందింది. ఈ ఘటన అట్లాంటా నగరంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని యాదగిరిపల్లికి చెందిన గుడ్ల కోటేశ్వర్‌రావు, బాలమణి దంపతులు కిరాణ దుకాణం నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. వారి కుమార్తె సౌమ్య (24) ఎమ్మెస్సీ చదివేందుకు 2022 ఆగస్టు 17న అమెరికాకు వెళ్లింది. మరో ముగ్గురు భారత విద్యార్థినులతో కలిసి అద్దెఇంట్లో నివాసముంటోంది. అట్లాంటాలోని ఫ్లోరిడా యూనివర్సిటీలో 4 నెలల క్రితం ఎమ్మెస్సీ పూర్తి చేసిన ఆమె.. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది.


అయితే ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో (అట్లాంటా కాలమానం ప్రకారం) కూరగాయలు తీసుకొచ్చేందుకు కాలినడకన బయటికెళ్లింది. తిరిగొస్తుండగా వెనుక నుంచి నుంచి కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. దీంతో అక్కడి వారు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఇదే విషయాన్ని సోమవారం ఉదయం 9.30 గంటలకు సౌమ్య స్నేహితులు ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పారు. అయితే పరిస్థితి విషమించడంతో సౌమ్య మరణించిందని కాసేపటికే మరోసారి ఫోన్‌ చేసి తెలిపారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన కూతురు రోడ్డు ప్రమాదానికి బలవ్వడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు భారత ప్రభుత్వం ద్వారా మాట్లాడి మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

Updated Date - May 28 , 2024 | 05:14 AM

Advertising
Advertising