Secunderabad: ఎన్ని కుట్రలు చేసినా నివేదిత విజయం ఖరారు
ABN , Publish Date - May 11 , 2024 | 12:02 PM
కాంగ్రెస్ పార్టీ ఎన్ని డబ్బులు పంచినా, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా కంటోన్మెంట్ ఉప ఎన్నికలో విజయం బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితదేనని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి(Malkajigiri MLA Marri Rajasekhar Reddy) అన్నారు.
సికింద్రాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్ని డబ్బులు పంచినా, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా కంటోన్మెంట్ ఉప ఎన్నికలో విజయం బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితదేనని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి(Malkajigiri MLA Marri Rajasekhar Reddy) అన్నారు. కంటోన్మెంట్ ఎన్నికలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత గెలుపుకోసం శనివారం మర్రి రాజశేఖర్‌రెడ్డి కంటోన్మెంట్లో నివేదితతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం బోయినపల్లి సౌజన్యకాలనీలోని బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో ఉప ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితతో కలిసి పాల్గొన్నారు. ఈ సమావేశంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు అనితాప్రభాకర్, నళిని కిరణ్, పాండుయాదవ్, భాగ్యశ్రీ శ్యామ్‌కుమార్, లోకనాధం, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప హరికృష్ణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీ.ఎన్.శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఆకుల హరి, నర్సింహ ముదిరాజ్, వార్డు బీఆర్ఎస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, మహిళానేతలు, పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: బీజేపీ, బీఆర్ఎస్కు ప్రశ్నించే హక్కులేదు: పొన్నం
నివేదితను భారీ మెజారిటీతో గెలిపించండి
తిరుమలగిరి: కంటోన్మెంట్ బోర్డ్ 7వ వార్డు మాజీ సభ్యులు ప్యారసాని శ్యామ్‌కుమార్, భాగ్యశ్రీల ఆధ్వర్యంలో లోతుకుంటలో ఏర్పాటు చేసిన కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ జనగర్జన సభలో కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని మట్లాడారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న ఎంతో అభివృద్ధి చేశారని. ఆయన కూతురు నివేదితను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు.
ఇదికూడా చదవండి: Hyderabad: హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు భారీగా పయనం..
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News