ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Secunderabad: ఊరెళ్లే దారేదీ..? నామమాత్రంగా ప్రత్యేక రైళ్లు

ABN, Publish Date - Oct 09 , 2024 | 09:08 AM

దసరా, సద్దుల బతుకమ్మ పండుగల(Dasara and Saddula Bathukamma festivals) నేపథ్యంలో ఇటు తెలంగాణ జిల్లాలకు, అటు ఆంధ్రా ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌(Secunderabad Railway Station) కిటికిటలాడుతోంది. ఒకవైపు పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు కావడంతో నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

- అవస్థలు పడుతున్న దూరప్రాంత ప్రయాణికులు

- రైలు సర్వీస్‌లను పెంచాలంటూ విజ్ఞప్తులు

‘పండుగొస్తుంది.. దూర ప్రాంతంలో ఉన్న ఊళ్లకు వెళ్లాలి.. ప్రత్యేక రైలు సర్వీసుల ఏర్పాటు అంతంత మాత్రంగానే ఉండడంతో టికెట్లు దొరకక తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది.. ప్రస్తుత రైళ్లకు అయినా అదనపు బోగీలను ఏర్పాటు చేయకపోవడంతో ఊరెలా వెళ్లాలి’.. అంటూ ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు.

సికింద్రాబాద్‌: దసరా, సద్దుల బతుకమ్మ పండుగల(Dasara and Saddula Bathukamma festivals) నేపథ్యంలో ఇటు తెలంగాణ జిల్లాలకు, అటు ఆంధ్రా ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌(Secunderabad Railway Station) కిటికిటలాడుతోంది. ఒకవైపు పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు కావడంతో నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కుల దైవానికి మొక్కి.. చోరీల వేటకు..


రెగ్యులర్‌గా వెళ్లే రైళ్లలో సీట్లు దొరకక, నిలుచుని వెళ్లేస్థాయిలో సైతం స్థలం లేక కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తోందని కాగజ్‌నగర్‌, ఖమ్మం, విజయవాడ, వైజాగ్‌, రాయలసీమ(Khagajnagar, Khammam, Vijayawada, Vizag, Rayalaseema) వంటి దూరప్రాంతవాసులు తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులతో వెళ్లలేక మరోరైలు కోసం పడిగాపులు కాయాల్సి వస్తోందన్నారు. గత ఏడాది మాదిరిగా ఎక్కువ సంఖ్యలో ప్రత్యేక రైలు సర్వీసులను నడిపించాలని, ప్రస్తుతమున్న రెగ్యులర్‌ రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేసి ప్రయాణికుల అవస్థలు తీర్చాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.


150 రైల్వేస్టేషన్లలో ‘నవరాత్రి వ్రత’ స్పెషల్‌ థాలీ

దసరా నవరాత్రులను పురస్కరించుకొని రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు భారతీయ రైల్వే ‘నవరాత్రి వ్రత’ స్పెషల్‌ థాలీని అందిస్తోంది. దేశవ్యాప్తంగా 150 రైల్వే స్టేషన్లలో ఈ సదుపాయం అందుబాట్లో ఉండగా, తెలుగు రాష్ట్రాల్లోని సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, తిరుపతి స్టేషన్ల(Secunderabad, Hyderabad and Tirupati stations)లో నవరాత్రి స్పెషల్‌ థాలీ లభిస్తుందని దక్షిణమధ్యరైల్వే సీపీఆర్‌ఓ శ్రీధర్‌ పేర్కొన్నారు. ఐఆర్‌సీటీసీ యాప్‌లో ప్రయాణికులు తమ పీఎన్‌ఆర్‌ నంబర్‌ను నమోదు చేసి, నవరాత్రి స్పెషల్‌ థాలీని సులభంగా బుక్‌ చేసుకోవచ్చన్నారు.


ఇదికూడా చదవండి: Harish Rao: ఫీజుల చెల్లింపుల్లో సర్కారు నిర్లక్ష్యం

ఇదికూడా చదవండి: Mulugu: కాటేసిన పాము, కరెంటు!

ఇదికూడా చదవండి: విద్యుత్తు శాఖలో ఖాళీల భర్తీకి త్వరలో భారీ నోటిఫికేషన్‌

ఇదికూడా చదవండి: Investment Scam: స్టాక్‌ బ్రోకింగ్‌ పేరుతో.. ఘరానా మోసం!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 09 , 2024 | 09:08 AM