ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Seethakka: పల్లెల్లో రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టండి..

ABN, Publish Date - Jun 07 , 2024 | 04:28 AM

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పంచాయతీల్లో అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.

  • అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు

హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పంచాయతీల్లో అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో పలు అంశాలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. సీఆర్‌ఆర్‌, ఎంఆర్‌ఆర్‌ నిధులు వినియోగించి గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయాలని చెప్పారు. వర్షాకాలంలో రోడ్లు మరింత పాడయ్యే అవకాశం ఉన్నందున దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేయాలని సూచించారు. పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పన, కొత్త పనులకు ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఇప్పటికే పాడైన రోడ్లకు మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం వంటి అంశాలపై అంచనాలు తయారు చేయాలని చెప్పారు. పెండింగ్‌ పనులను వేగంగా పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి సీతక్క అధికారులను హెచ్చరించారు.


బీజేపీ దగ్గర కేసీఆర్‌ సుపారీ: యెన్నం

బీజేపీ దగ్గర సుపారీ తీసుకున్న కేసీఆర్‌ తన కుటుంబం కోసం లక్షలాది మంది బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను మోసం చేశారని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి ఆరోపించారు. అందుకే మహహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ ఓడిపోయిందన్నారు. గురువారం గాంధీభవన్‌లో శ్రీనివా్‌సరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సీఎంకు సొంత జిల్లా అంటూ ఉండదని, రాష్ట్రం అంతా సీఎందే అని పేర్కొన్నారు. కేసీఆర్‌ మద్దతుతో బీజేపీకి ఓటింగ్‌ పెరిగిందని విమర్శించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ఓట్లను బీజేపీకి బదిలీ చేయడం వల్లనే ఆ పార్టీ 8 సీట్లలో గెలిచిందని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌ ఆరోపించారు. డిసెంబరు 9న తెలంగాణ తల్లి జన్మదినం జరుపుకుంటే తప్పేంటని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ ప్రశ్నించారు. సోనియా నిర్ణయం పట్టుదల వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని తెలిపారు. ఈ విషయంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ చేసిన వ్యాఖ్యలను నిరంజన్‌ ఖండించారు.

Updated Date - Jun 07 , 2024 | 04:28 AM

Advertising
Advertising