ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Seethakka: నియంత పాలనకు మోదీ కుట్ర..

ABN, Publish Date - May 20 , 2024 | 05:51 AM

దేశంలో నియంత పాలనను తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కుట్రలు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రజలకు ఏం చేసిందో చెప్పుకోలేక విపక్షాలపై విమర్శలు గుప్పించడం సిగ్గు చేటన్నారు.

  • ఏం చేశారో చెప్పుకోలేక విపక్షాలపై విమర్శలు: సీతక్క

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, మే 19 (ఆంధ్రజ్యోతి): దేశంలో నియంత పాలనను తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కుట్రలు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రజలకు ఏం చేసిందో చెప్పుకోలేక విపక్షాలపై విమర్శలు గుప్పించడం సిగ్గు చేటన్నారు. ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్న కన్నయ్య కుమార్‌కు మద్దతుగా టీకాంగ్రెస్‌ నేతలతో కలసి అక్కడ సీతక్క ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పేద మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలనూ బీజేపీ విమర్శిస్తోందని దుయ్యబట్టారు. రాహుల్‌ గాంధీ ప్రధాని అయితేనే దేశ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.


ఈ ఎన్నికల్లో గెలిచి ఇండియా కూటమి అధికారంలోకి రావడం తథ్యమని వ్యాఖ్యానించారు. కాగా, ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ అమలు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కసరత్తు ప్రారంభించారని.. రుణమాఫీ కాగానే ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌లు సిద్ధంగా ఉండాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌గౌడ్‌ అన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందని తెలిసి.. రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై వారు పదే పదే రాద్ధాంతం చేశారని ఓ ప్రకటనలో మండిపడ్డారు.

Updated Date - May 20 , 2024 | 05:51 AM

Advertising
Advertising