ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Road Accidents: తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న రోడ్డు ప్రమాదాలు..

ABN, Publish Date - Dec 08 , 2024 | 11:50 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం శివారులో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ (ఆదివారం) భారీ రోడ్డుప్రమాదాలు సంభవించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వాహనాలు ఢీకొని పలువురు మృతిచెందగా.. మరికొంతమంది తీవ్ర గాయాలపాలయ్యారు. అతివేగం కారణంగా కొంతమంది ప్రాణాలు కోల్పోతే.. నిద్రమత్తులో వాహనం నడిపి ఇంకొంత మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాల్లో పలువురు మరణించగా, వారి కుటుంబసభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నేడు జరిగిన రోడ్డుప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.


తెలంగాణ- రోడ్డు ప్రమాదాలు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం శివారులో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని అశ్వారావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


సిద్దిపేట జిల్లా గజ్వేల్ జాలిగామ బైపాస్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను పరంధాములు(43), పూస వేంకటేశ్వర్లు(42) గా పోలీసులు గుర్తించారు. పరంధాములు సిద్దిపేట జిల్లా రాయపోల్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తుండగా.. దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పూస వేంకటేశ్వర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ హైదరాబాద్‍లో జరిగే మారథాన్ రన్నింగ్‌లో పాల్గొనేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కాగా, కానిస్టేబుళ్లు మృతిపై మాజీ మంత్రి హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ అకాడమీ వద్ద ఓఆర్ఆర్‌పై ఓ లారీని కారు ఢీకొట్టింది. ముందు వెళ్తున్న లారీని వేగంగా వచ్చిన కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించారు.


మరోవైపు హనుమకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. వరంగల్- కరీంనగర్ జాతీయ రహదారి అన్నసాగర్ వద్ద కాకతీయ కెనాల్ బ్రిడ్జి పైనుంచి ఇసుక లారీ కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.


ఏపీ- రోడ్డు ప్రమాదాలు..

ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే.. పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబం తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. బ్రహ్మణపల్లి వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో సురేశ్‌, వనిత, యోగులు, వేంకటేశ్వర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. కొత్తగా కారు కొనుగోలు చేయడంతో కొండగట్టుకు వెళ్లి పూజలు చేయించారు. అనంతరం తిరిగి వస్తుండగా ప్రమాదం సంభవించింది. తీవ్రంగా గాయపడిన బాధితులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.


ప.గో.జిల్లా భీమవరం మండలం బేతపూడి వద్ద ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. వెంప గ్రామానికి చెందిన సానబోయిన రమేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాత్రి పుష్ప-2 సినిమా చూసేందుకు అతను భీమవరం వెళ్తుండగా మరో ద్విచక్రవాహనం ఢీకొని రమేశ్ ప్రాణాలు విడిచారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: నేడు అంగరంగ వైభవంగా ప్రజాపాలన విజయోత్సవాలు..

Hyderabad: నగర వాసులకు బిగ్ అలెర్ట్.. నేడు పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు

Updated Date - Dec 08 , 2024 | 11:55 AM