ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పోగొట్టుకున్న సొమ్మున 11 నిమిషాల్లో పట్టేశారు

ABN, Publish Date - Jun 29 , 2024 | 04:25 AM

సైబర్‌ నేరగాళ్ల వలలో పడ్డ ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ రూ. 18లక్షలు పోగొట్టుకున్నాడు. వెంటనే తాను మోసపోయానని తెలుసుకొని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పి తనకు సాయం చేయాలని విన్నవించాడు.

  • సైబర్‌ నేరగాళ్ల వలలో పడ్డ టెకీ

  • 18 లక్షలు కొల్లగొట్టిన ముఠా

  • అప్రమత్తమై వెంటనే ఫిర్యాదు చేసిన బాధితుడు

  • వేగంగా స్పందించి రికవరీ చేసిన సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరగాళ్ల వలలో పడ్డ ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ రూ. 18లక్షలు పోగొట్టుకున్నాడు. వెంటనే తాను మోసపోయానని తెలుసుకొని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పి తనకు సాయం చేయాలని విన్నవించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేసి, నగదు బదిలీ జరిగిన బ్యాంకు అధికారులతో మాట్లాడి నేరగాళ్ల ఖాతాలో జమైన డబ్బును ఫ్రీజ్‌ చేశారు. ఈ మొత్తం ప్రక్రియను కేవలం 11 నిమిషాల్లోనే పూర్తి చేసి భేష్‌ అనిపించుకున్నారు. సైబర్‌ క్రైమ్‌ డీసీపీ కవిత ధార వివరాల ప్రకారం.. అంబర్‌పేటకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి రెండు రోజుల క్రితం ఫోనొచ్చింది.


ముంబై క్రైమ్‌ బ్రాంచి నుంచి మాట్లాడుతున్నాం అని నమ్మించిన కేటుగాళ్లు, ఆయన అడ్ర్‌సతో ముంబై నుంచి ఇరాన్‌కు వెళుతున్న డ్రగ్స్‌ పార్శిల్‌ను పట్టుకున్నామని, క్రిమినల్‌ కేసు నమోదైందని, వెంటనే డిజిటల్‌ అరెస్టు చేస్తున్నామని భయపెట్టారు. పైగా ఆయన బ్యాంకు ఖాతా నుంచి అనుమానాస్పదమైన ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సమాచారం ఉందని, ఖాతా నుంచి కొంతడబ్బును ఆర్థిక శాఖ ఖాతాకు బదిలీ చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించారు. భయపడిపోయిన బాధితుడు బ్యాంకు లోన్‌ తీసుకొని మరీ రూ.18లక్షలు వారి ఖాతాలో జమ చేశారు. డబ్బులు ఖాతాలో జమ అయిన వెంటనే స్పందించడం మానేశారు. అనుమానించిన బాధితుడు వెంటనే ఈనెల 27న సాయంత్రం 6:58 గంటలకు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించి తన గోడు వెల్లబోసుకున్నాడు.


డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ శ్రీకాంత్‌ నాయక్‌ వెంటనే అప్రమత్తమై బాధితుడి ఫిర్యాదును ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశాడు. ఆ తర్వాత బాధితుడు డబ్బులు బదిలీ చేసిన బ్యాంకులోని నోడల్‌ అధికారితో మాట్లాడి ఆ డబ్బులు ఏ ఖాతాకు బదిలీ అయ్యానేది తెలుసుకొని సైబర్‌ క్రైమ్‌ 1930 సిబ్బందిని అప్రమత్తం చేశాడు. వెంటనే స్పందించిన సిబ్బంది బాధితుడు పంపిన డబ్బు రూ. 18 లక్షలు ఒక అనుమానిత ఖాతాలో ఉన్నట్లు గుర్తించి వెంటనే ఆ మొత్తాన్ని ఫ్రీజ్‌ చేయించారు. ఈ మొత్తం ప్రక్రియను కానిస్టేబుల్‌ శ్రీకాంత్‌ 11 నిమిషాల్లో పూర్తి చేసినట్లు డీసీపీ వెల్లడించారు. సైబర్‌ మోసానికి గురైన బాధితులు వెంటనే గంటలోపే స్పందించి పోలీసులను ఆశ్రయిస్తే.. సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టిన డబ్బును ఎక్కడో ఒక చోట ఫ్రీజ్‌ చేసే అవకాశం ఉంటుందని డీసీపీ కవిత పేర్కొన్నారు. దాన్నే గోల్డెన్‌ అవర్‌ అంటారని చెప్పారు.

Updated Date - Jun 29 , 2024 | 04:25 AM

Advertising
Advertising