Sri Chaitanya: శ్రీ చైతన్య విద్యార్థికి ప్రధాని ప్రశంసలు..

ABN, Publish Date - Jul 23 , 2024 | 03:27 AM

అంతర్జాతీయ మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బావదాన్‌ పుణేకు చెందిన శ్రీ చైతన్య టెక్నో పాఠశాల విద్యార్థి ఆదిత్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌ వేదికగా ప్రశంసించారని శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్‌ సుష్మ తెలిపారు.

Sri Chaitanya: శ్రీ చైతన్య విద్యార్థికి ప్రధాని ప్రశంసలు..

హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బావదాన్‌ పుణేకు చెందిన శ్రీ చైతన్య టెక్నో పాఠశాల విద్యార్థి ఆదిత్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌ వేదికగా ప్రశంసించారని శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్‌ సుష్మ తెలిపారు. దేశానికి చెందిన ఆరుగురు సభ్యుల విద్యార్థి బృందం యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని బాత్‌లో జరిగిన 65వ అంతర్జాతీయ మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌- 2024లో నాలుగు బంగారు, ఒక రజత పతకంతోపాటు మొత్తంగా 4వ ర్యాంకులో నిలిచిందని ఆమె చెప్పారు. ఈ బృందంలో శ్రీ చైతన్య టెక్నో పాఠశాల విద్యార్థి ఎంవి. ఆదిత్య అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్నాడని సుష్మ పేర్కొన్నారు.

Updated Date - Jul 23 , 2024 | 03:27 AM

Advertising
Advertising
<