ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Farmers: ఫార్మా విలేజికి స్థలాలిచ్చిన రైతులకు స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు

ABN, Publish Date - Dec 29 , 2024 | 03:43 AM

రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం మండలాల్లో గ్రీన్‌ ఫార్మా విలేజీ ఏర్పాటు కోసం స్థలాలిచ్చిన రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

  • రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు

హైదరాబాద్‌, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం మండలాల్లో గ్రీన్‌ ఫార్మా విలేజీ ఏర్పాటు కోసం స్థలాలిచ్చిన రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సదరు రైతులకు ఇచ్చే ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ సమయంలో స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీలను మినహాయించింది. కందుకూరు మండలంలో 1553, యాచారం మండలంలో 3740 మంది రైతులు ఫార్మా విలేజీ కోసం స్థలాలిచ్చారు. వీళ్లకి ప్రభుత్వం నివాస స్థలాలు కేటాయించింది. డ్రా పద్ధతిలో ఆ ప్లాట్లను కేటాయించనుంది. అయితే, ఈ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ సమయంలో ఆయా రైతుల నుంచి స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీలు వసూలు చేయరు. ఇందుకు సంబంధించిన రూ.26.14 కోట్ల స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ర్టేషన్‌ చార్జీలను మినహాయించాలని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదేశించింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Dec 29 , 2024 | 03:43 AM