RRR Project: ఆర్‌ఆర్‌ఆర్‌కు 1,525 కోట్లు!

ABN, Publish Date - Jul 26 , 2024 | 03:50 AM

రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది.

RRR Project: ఆర్‌ఆర్‌ఆర్‌కు  1,525 కోట్లు!

  • భూ పరిహారం చెల్లింపునకు కేటాయింపు

హైదరాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి)ః రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగం భూ పరిహారం కోసం రాష్ట్ర వాటా కింద రూ.1,525కోట్లను కేటాయించింది. గత ప్రభుత్వం 2023-24బడ్జెట్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగం భూ పరిహారం చెల్లింపునకు అవసరమైన నిధుల్లో కేవలం రూ.500కోట్లను కేటాయించినా, ఒక్క రూపాయు ఖర్చు చేయకపోవడం గమనార్హం. మరోవైపు రీజినల్‌ రింగు రోడ్డును మొదట 4లేన్లుగా నిర్మించి, తర్వాత ట్రాఫిక్‌ రద్దీకి అనుగుణంగా 8లేన్లగా విస్తరిస్తామని, గురువారం నాటి బడ్జెట్‌ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.


భవిష్యత్తులో విస్తరించబోయే 8లేన్ల రహదారికి కావాల్సిన స్థాయిలోనే భూ సేకరణ చేస్తున్నట్లు తెలిపారు. ఉత్తర భాగం రహదారి చౌటుప్పల్‌లో మొదలై ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమనగల్‌, చేవెళ్ల, శంకర్‌పల్లి మీదుగా సంగారెడ్డికి అనుసంధానం కానుంది. దీని నిర్మాణానికి దాదాపు 2వేల హెక్టార్ల భూమి అవసరమవుతుందని ఎన్‌హెచ్‌ఏఐ ప్రాధమికంగా అంచనా వేసింది.

Updated Date - Jul 26 , 2024 | 03:50 AM

Advertising
Advertising
<