ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

State Assembly: అట్టుడికిన అసెంబ్లీ..

ABN, Publish Date - Aug 01 , 2024 | 02:40 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక శాసనసభ తొలిసారిగా అట్టుడికింది. అధికార, ప్రతిపక్షాల అరుపులు, కేకలు, విమర్శలు, ప్రతివిమర్శల మధ్య బుధవారం ఆద్యంతం వాడివేడిగా జరిగింది.

రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల సాక్షిగా అది బహిర్గతమైంది. సభలో అఽధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంగా మారి.. అసెంబ్లీ అట్టుడికింది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు సమాధానం చెప్పే క్రమంలో సీఎం రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు సభలో ప్రకంపనలు సృష్టించాయి. ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపారు. సీఎం అవమానకరంగా మాట్లాడారంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబిత కంటతడి పెట్టారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రతిపక్ష నేతల ఆరోపణల్ని అఽఽధికార కాంగ్రెస్‌ నేతలు తిప్పికొట్టారు. మరోవైపు కొందరు ఎమ్మెల్యేల శాసనసభ్యత్వం రద్దవుతుందంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.

  • ‘అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారు’.. సీఎం రేవంత్‌ వ్యాఖ్యలతో దుమారం

  • వారిని నమ్ముకుంటే బస్టాండే గతి అన్న సీఎం

  • తీవ్ర నిరసన తెలిపిన బీఆర్‌ఎస్‌ సభ్యులు

  • పోడియం వద్ద మహిళా సభ్యుల బైఠాయింపు

  • ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

  • కాంగ్రెస్‌ సభ్యుల ఎదురుదాడితో గందరగోళం

  • రేవంత్‌పై మండిపడ్డ సబితా ఇంద్రారెడ్డి

  • గందరగోళం మధ్యే ‘ద్రవ్య వినిమయ బిల్లు’కు

  • మూజువాణి ఓటుతో శాసనసభ ఆమోదం

  • నేటికి సభను వాయిదా వేసిన స్పీకర్‌

  • పోడియం వద్దకు బీఆర్‌ఎస్‌ సభ్యులు

  • సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

  • కాంగ్రెస్‌ ఎదురుదాడితో గందరగోళం

  • రేవంత్‌పై మండిపడ్డ సబితా ఇంద్రారెడ్డి

  • కాంగ్రె్‌సలోకి అక్కగా ఆహ్వానించాను

  • నన్నెందుకు టార్గెట్‌ చేస్తున్నారు?: సబిత

హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక శాసనసభ తొలిసారిగా అట్టుడికింది. అధికార, ప్రతిపక్షాల అరుపులు, కేకలు, విమర్శలు, ప్రతివిమర్శల మధ్య బుధవారం ఆద్యంతం వాడివేడిగా జరిగింది. ఒక దశలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేయడంతో సభ అదుపు తప్పింది. సభ్యులను గాడిలో పెట్టడానికి స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బీఆర్‌ఎస్‌ సభ్యుడు కేటీఆర్‌కు సమాధానం చెప్పే క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ పార్టీ మహిళా సభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్‌ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు.


మధ్యలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. వారు పట్టించుకోలేదు. దీంతో అధికార కాంగ్రెస్‌ సభ్యులు కూడా ముందుకు వచ్చి, సీఎంకు, డిప్యూటీ సీఎంకు బాసటగా నిలిచారు. ఇరు పక్షాల అరుపులు, గందరగోళం మధ్యే ‘ద్రవ్య వినిమయ బిల్లు-2024’ సభ ఆమోదం పొందింది. శాసనసభ ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ చర్చను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతుండగానే ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్‌రెడ్డి సభలోకి ప్రవేశించారు.


కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలంటూ కేటీఆర్‌ డిమాండ్‌ చేస్తుండగా.. మధ్యలో రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడారు. ‘‘ప్రతిపక్ష సభ్యులు కలిసివస్తారనుకున్నాం. కానీ, ప్రతిపక్ష నేత సభకు రారు. కేటీఆర్‌కు సూచన చేస్తున్నా. వెనుక ఉన్న అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారు. వాళ్లను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండులో కూర్చోవాల్సిందే’’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా గందరగోళానికి దారితీశాయి. తమను ఉద్దేశించే సీఎం ఈ వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఇతర బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కుర్చీల్లోంచి లేచి నిరసన తెలిపారు. వెల్‌లోకి దూసుకొచ్చి పోడియంను చుట్టుముట్టారు.


  • రేవంత్‌ను అక్కగా ఆహ్వానించా..

మంత్రి శ్రీధర్‌బాబు కల్పించుకుని.. ముఖ్యమంత్రి ఎవరి గురించీ ప్రస్తావించలేదని, ఒక సూచన, సలహా మాత్రమే ఇచ్చారని అన్నారు. సజావుగా నడుస్తున్న సభను పక్కదారి పట్టిస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. మంత్రి సీతక్క జోక్యం చేసుకుని.. తనను మోసం చేసిన అక్కలతో జాగ్రత్తగా ఉండాల్సిందిగా కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి సూచన చేశారని చెప్పారు. మీతో కలిసి వస్తానంటూ సబితా ఇంద్రారెడ్డి చెప్పడంతో రాహుల్‌గాంధీతో మాట్లాడి ఢిల్లీకి తీసుకెళ్లాలనుకున్నామని, కానీ.. ఇంతలో సబిత హ్యాండిచ్చారని ఆరోపించారు. పైగా.. కాంగ్రె్‌సలో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండంటూ సబితతోనే గవర్నర్‌కు ఫిర్యాదు చేయించారని ధ్వజమెత్తారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి గద్గద స్వరంతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి తననెందుకు టార్గెట్‌ చేస్తున్నారని ప్రశ్నించారు.


ఓ అక్కగా ‘కాంగ్రె్‌సలోకి రా తమ్ముడూ అని రేవంత్‌ను ఆహ్వానించానని, కాంగ్రె్‌సలో ఆశాకిరణం అవుతావని, సీఎం అవుతావని ఆశీర్వదించానని తెలిపారు. దీంతో సీఎం రేవంత్‌ మళ్లీ కల్పించుకుంటూ.. తనను మోసం చేసిన సబితక్కతో జాగ్రత్తగా ఉండాల్సిందిగా కేటీఆర్‌కు సూచన చేశానని అన్నారు. ‘‘ సబితక్క నన్ను కాంగ్రె్‌సలోకి ఆహ్వానించిన మాట వాస్తవం. 2019లో మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నన్ను కోరింది. అక్కడి నుంచి పోటీ చేస్తే అండగా ఉంటానని సబితక్క నాకు మాట ఇచ్చారు. కానీ, కాంగ్రెస్‌ పార్టీ నన్ను అభ్యర్థిగా ప్రకటించగానే.. ఆమె బీఆర్‌ఎ్‌సలోకి వెళ్లి మంత్రి పదవి పొందారు’’ రేవంత్‌ అన్నారు. కొత్త గవర్నర్‌ను విమానాశ్రాయానికి వెళ్లి రిసీవ్‌ చేసుకోవాల్సి ఉందని, తిరిగి వచ్చిన తర్వాత అందరికీ కలిపి సమాధానం చెబుతానని చెప్పి సభ నుంచి సీఎం బయటికి వెళ్లారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేచి.. బీఆర్‌ఎ్‌సపై ఎదురుదాడి చేశారు.


  • ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం..

మధ్యలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ కల్పించుకొని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క.. సబితా ఇంద్రారెడ్డి పేరు పెట్టి మాట్లాడినందున.. ఆమెకు తిరిగి మాట్లాడే హక్కు ఉందన్నారు. అయితే ముగ్గురు బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు పోడియం వద్ద నేలపై కూర్చుని నిరసన కొనసాగిస్తుండడంతో స్పీకర్‌ మైక్‌ను కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జి.వివేక్‌కు ఇచ్చారు. కాగా, ఆయన ప్రసంగం మొదలుపెట్టి.. ముగించేదాకా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఆందోళన కొనసాగుతూనే ఉంది. మరోవైపు కాంగ్రెస్‌ సభ్యులు కూడా తీవ్రంగా ప్రతిస్పందించారు. ఈ గందరగోళం మధ్యే స్పీకర్‌ అనుమతితో ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించాలంటూ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సభను కోరారు. దీంతో మూజువాణి ఓటుతో బిల్లును సభ ఆమోదించింది. ఈ సందర్భంలో భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం ఈసారి పీపుల్స్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని అన్నారు. దీని పట్ల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటే బీఆర్‌ఎస్‌ తట్టుకోలేకపోతోందని ఆరోపించారు. అనంతరం సభను గురువారానికి స్పీకర్‌ వాయిదా వేశారు.


  • ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారు?

సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నత పదవులు అనుభవించారని, ఆ తర్వాత పార్టీని వదిలి బీఆర్‌ఎ్‌సలో చేరారని భట్టివిక్రమార్క విమర్శించారు. దళితుడినైన తాను ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. ఆమె బీఆర్‌ఎ్‌సలో చేరి, తాను ఆ హోదా కోల్పోవడానికి కారకులయ్యారని తెలిపారు. సబితకు 2004, 2009లో కాంగ్రెస్‌ పార్టీ మంత్రి పదవులు ఇచ్చిందని గుర్తు చేశారు. దశాబ్దకాలంపాటు మంత్రి పదవులు అనుభవించిన సబితా ఇంద్రారెడ్డి.. తనను ప్రతిపక్ష నేతగా నిలబెట్టాల్సిందిపోయి.. అధికారం కోసం పార్టీ మారారని ఆరోపించారు.


ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. దీంతో సభ మరోసారి హీటెక్కింది. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో.. మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ సభను 10 నిమిషాలపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం సభ పునఃప్రారంభం కాగా.. మళ్లీ అదే సీన్‌ రిపీట్‌ అయింది. సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు సబిత, సునీతా లక్ష్మారెడ్డి వెల్‌లోకి దూసుకెళ్లారు. వీరితోపాటు కోవ లక్ష్మి, కేటీఆర్‌, కౌశిక్‌రెడ్డి, కమలాకర్‌ తదితరులు పోడియం వద్దకు దూసుకొచ్చారు. మహిళా ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు.

Updated Date - Aug 01 , 2024 | 02:41 AM

Advertising
Advertising
<