ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLC Kavitha: కవితకు బెయిల్‌ వచ్చేనా..?

ABN, Publish Date - Aug 12 , 2024 | 04:34 AM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.

  • నేడు సుప్రీంకోర్టులో విచారణ

  • జస్టిస్‌ గవాయ్‌ ధర్మాసనం ముందుకు దరఖాస్తు

  • సిసోడియాకు బెయిల్‌ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వర్గాల్లో ఆశలు

న్యూఢిల్లీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. తనపై ఈడీ, సీబీఐలు నమోదు చేసిన కేసుల్లో బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ కవిత ఈ నెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(క్రిమినల్‌) దాఖలు చేశారు. మద్యం పాలసీ కేసులో కవిత సాక్ష్యాలను ధ్వంసం చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న దర్యాప్తు సంస్థల వాదనలతో ఢిల్లీ హైకోర్టు ఏకీభవించింది.


‘‘ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో 50 మందిని నిందితులుగా పేర్కొన్నాయి. అందులో కవిత మాత్రమే మహిళ. మహిళలకు కొన్ని ప్రత్యేక వెసులుబాట్లను చట్టాలు కల్పించాయి. మహిళా చట్టాలను పరిగణనలోకి తీసుకుని కవితకు బెయిల్‌ ఇవ్వండి. కవిత విషయంలో దర్యాప్తు సంస్థలు మొదటి నుంచీ చట్టాలను ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. అరెస్టు సమయంలో కనీస నిబంధనలు పాటించలేదు. మహిళలకు ప్రత్యేక రక్షణలు ఉన్నాయి.


వాటి కింద కవితకు బెయిల్‌ ఇవ్వాలి’’ అని కవిత తరఫున సీనియర్‌ న్యాయవాదులు వినిపించిన వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇరుపక్షాల సుధీర్ఘ వాదనల తర్వాత కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ కొట్టేశారు. ఇప్పుడు కవిత అవే అంశాల ఆధారంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం విచారించనుంది.


ఇదే ధర్మాసనం శుక్రవారం ఢిల్లీ మద్యం కేసులో మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు బెయిల్‌ మంజూరు చేసింది. ఈసారి తమ నాయకురాలికి తప్పనిసరిగా బెయిల్‌ వస్తుందని బీఆర్‌ఎస్‌ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్‌ చేసింది. ఆమె నాటి నుంచి తిహాడ్‌ జైలులో ఉన్నారు. కవిత తిహాడ్‌ జైలులో ఉండగానే ఏప్రిల్‌ 15న సీబీఐ అరెస్టు చేసినట్టు ప్రకటించింది.

Updated Date - Aug 12 , 2024 | 08:09 AM

Advertising
Advertising
<