MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మధ్యంతర బెయిల్‌పై ఉత్కంఠ
ABN, Publish Date - Apr 08 , 2024 | 09:14 AM
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. నేడు లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించనుంది.
ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)కు మధ్యంతర బెయిల్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. నేడు లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించనుంది. ఉదయం 10:30 గంటలకు సీబీఐ స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి భవేజా తీర్పును వెలువరించనుంది. ఏప్రిల్ 4న కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం.. మహిళగా, ఎమ్మెల్సీగా ఉన్నందున.. ముఖ్యంగా తన చిన్న కుమారుడుకి 11వ తరగతి పరీక్షలు ఉన్నందున ఏప్రిల్ 16 వరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు. ఈ మధ్యంతర బెయిల్‌ను ఈడీ వ్యతిరేకిస్తోంది.
ట్యాపింగ్ తొలి బాధితుణ్ని నేనే
కవితకు బెయిల్ ఇస్తే లిక్కర్ కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని, సాక్ష్యులను, ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఈడీ చెబుతోంది. ఇప్పటికే అప్రూవర్‌గా మారిన కొందరిని కవిత బెదిరించారని అందుకు ఆధారాలు ఉన్నాయని కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని కోర్టును ఈడీ కోరింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనిలాండరింగ్ కేసులో మార్చి 15న కవిత అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో కవిత ఉన్నారు. రేపటితో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది. నేడు బెయిల్ రాకపోతే.. రేపు కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించే అవకాశం ఉంది. రేపు కవితను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడం, లిక్కర్ కేసులో కవితను సీబీఐ విచారణకు అనుమతించడంపై రేపు రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 20న రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరుపనుంది.
40 మంది మహిళలకు లైంగిక వేధింపులు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...
Updated Date - Apr 08 , 2024 | 09:15 AM