ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TS News: జ్వర స్వైర విహారం

ABN, Publish Date - Aug 12 , 2024 | 04:28 AM

కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం బుస్సారాయిలో 18 నెలల పాప మలేరియాతో బాధపడుతూ గత నెల 20న ప్రాణాలు విడిచింది.

  • 3000 కు దగ్గర్లో డెంగీ కేసులు

  • 6500 టైఫాయిడ్‌ కేసులు

  • రాష్ట్రంలో విజృంభిస్తున్న విష జ్వరాలు, డెంగీ, మలేరియా.. ఏజెన్సీ జిల్లాల్లో ఎక్కువ.. ఇంటికి ఒకరిద్దరు బాధితులు

  • దోమల బెడద తీవ్రం.. ఫాగింగ్‌ లేనే లేదు

  • ప్రభుత్వాస్పత్రులకు పోటెత్తుతున్న రోగులు

  • పడకలు దొరకని దైన్యం.. ఇళ్లవద్దే చికిత్స

  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులూ కరువు

  • ఆసిఫాబాద్‌ జిల్లాలో జ్వరంతో ఇద్దరి మృతి

  • ఇబ్రహీంపట్నంలో 8 నెలల శిశువు కూడా..

  • వైద్యుల నిర్లక్ష్యంతోనేనన్న కుటుంబ సభ్యులు

హైదరాబాద్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం బుస్సారాయిలో 18 నెలల పాప మలేరియాతో బాధపడుతూ గత నెల 20న ప్రాణాలు విడిచింది. చిన్నారి ఐదారు రోజుల పాటు తీవ్ర జ్వరంతో బాధపడితే తల్లిదండ్రులు సమీప ఉల్వనూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళితే, రామవరం మాతాశిశు సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు రిఫర్‌ చేశారు. వారేమో వరంగల్‌ ఎంజీఎమ్‌కు తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడ చేరిన నాలుగు రోజులకు పాప చనిపోయింది. మలేరియాతోనే పాప చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.


ఆసిఫాబాద్‌ జిల్లా గుండాయిపేటకు చెందిన జాడె పూజ అనే బాలిక జ్వరంతో బాధపడుతూ శనివారం మృతి చెందింది. జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న ఆమె, జ్వరంతో అవస్థ పడుతూ తండ్రికి ఫోన్‌ చేసింది. హాస్టల్‌ నుంచి ఇంటికి తీసుకువచ్చి చికిత్స అందించినా తగ్గకపోవడంతో మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా ‘నాన్న నన్ను కాపాడు’ అంటూ తండ్రిని వేడుకుంటూనే మృతిచెందడం కలిచివేసింది.


.. ఇలా జ్వరాలకు ప్రాణాలొదులుతున్న వారు కొందరైతే.. ఎంతోమంది ఆస్పత్రులకు పోటెత్తుతున్నారు! పడకలు దొరక్క.. ఇళ్లవద్దే కొట్టుమిట్టాడుతున్నవారు ఇం కొందరు! కొన్నాళ్లుగా పల్లె, పట్నం తేడా లేకుండా జనాలకు జ్వరం పీడిస్తోంది. హైదరాబాద్‌ సహా అన్ని జిల్లాల్లోనూ వైరల్‌ జ్వరాలు, డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, టైఫాయిడ్‌, గ్యాస్ట్రో ఎంటెరిటిస్‌ కేసులు వస్తున్నాయి. ముఖ్యంగా కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగీ, మలేరియాతో మరణాలు కూడా నమోదవుతున్నాయి. అక్కడ చిన్నాపెద్ద అనే తేడా లేకుండా ఇంటికి ఒకరిద్దరు జ్వరంతో బాధపడుతున్నారు.


విషజ్వరాలు, డెంగీ, టైఫాయిడ్‌, గ్యాస్ట్రోఎంటెరిటిస్‌ కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. వీటికితోడు దగ్గు, జలుబు, ఫ్లూ కూడా ఉంటున్నాయి. రోగుల్లో ఎక్కువగా తీవ్రమైన చలిజ్వరం, భరించలేని, అడుగుతీసి అడుగు వేయలేనంత కీళ్లు, ఒళ్లు నొప్పులు, జలుబు, దగ్గు లక్షణాలు కనిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల భారీ వర్షాలు కురవడం.. లోతట్టు ప్రాంతాలు, గుంతల్లో వర్షం నీరు నిలవడం.. పరిసరాల అపరిశుభ్రత.. ఫలితంగా దోమల బెడద పెరగడంతో జ్వరాలు అంటుకుంటున్నాయి. చికిత్స కోసం పోటెత్తుండటంతో సర్కారు ఆస్పత్రులు రోగులతో నిండిపోతున్నాయి. అక్కడ పడకలు దొరక్కపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులకు రోగులు వెళుతున్నారు. అన్ని ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ భారీగా పెరిగినట్లు వైద్యులు చెబుతున్నారు.


  • ఫాగింగ్‌ కూడా కరువే..

దోమల నివారణ కోసం నిబంధనల మేరకు ప్రతి 45 రోజులకు ఫాగింగ్‌ చేయాలి. డెంగీ ప్రభావిత జిల్లాల్లోనైతే ఇంతకన్నా తక్కువ వ్యవధిలోనే ఫాగింగ్‌, స్ర్పేయింగ్‌ చేయాలి. ఈ విషయాన్ని ప్రజారోగ్య విభాగ సిబ్బంది విస్మరించారు. డెంగీ ప్రభావిత జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లోనూ ఫాగింగ్‌ చేయడం లేదు. పల్లెల్లో పారిశుధ్ధ్యం కూడా పడకేసింది. నిధుల్లేక పారిశుధ్ధ్య పనులు చేపట్టడం లేదు. కనీసం బ్లీచింగ్‌ కూడా వేయడం లేదు. డ్రైడేను పాటించడం లేదు. పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్స్‌లో కూడా కనీస మందులు ఉండటం లేదు. సీజనల్‌ వ్యాధుల నివారణకు ముందస్తు కార్యాచరణ చేపట్టకపోవడం, కనీస ఔషధాలను అందుబాటులో నిల్వ ఉంచుకోకపోవడంతో గ్రామీణ ప్రాంత రోగులు అల్లాడుతున్నారు.


  • కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, బూర్గంపాడు, మణుగూరు మండలాల పరిధిలో గత 24 రోజుల్లో కొత్తగా 37 మలేరియా కేసులు నమోదయ్యాయి.

  • ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో గత పదిరోజుల్లో కొత్త గా 35 డెంగీ కేసులొచ్చాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో రెండు నెలల్లో 10809 జ్వరాల కేసులు నమోదయ్యాయి. రిమ్స్‌ ఆదిలాబాద్‌లో గతంలో రోజూ 1100 వరకు ఓపీ రాగా... ప్రస్తుతం రోజూ 1700 వరకు కేసులొస్తున్నాయి.

  • నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లిలో విష జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడ ప్రతి ఇంటిలోనూ ఇద్దరు, ముగ్గురు విష జ్వరాల బారినపడ్డారు. ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేట గ్రామంలో డెంగీ, విష జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి.

  • ఉమ్మడి నల్లగొండ జిల్లా నిడుమానూరు, హుజూరాబాద్‌ మండలాల్లో 2వేలమంది జ్వరంతో బాధపడుతున్నారు.


  • డెంగీతో 8 నెలల శిశువు మృతి

ఇబ్రహీంపట్నం, కౌటాల, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డెంగీతో చిన్నారి మృతి చెందాడు. ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌కు చెందిన ప్రజ్వల్‌ (8నెలలు) అస్వస్థతకు గురవ్వడంతో శనివారం ఇబ్రహీంపట్నంలోని రవికృష్ణ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వైద్యులు డెంగీగా నిర్ధారించి చికిత్స ప్రారంభించగా ప్లేట్‌లెట్స్‌ పడిపోయి పరిస్థితి విషమించడంతో ఆదివారం పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలంటూ వైద్యులు సలహా ఇచ్చారు. అంబులెన్స్‌లో బాలుడిని నగరానికి తీసుకెళ్తుండగా మృతిచెందాడు. అలాగే, ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం గండాయిపేటలో బోయిరే కాశీనాథ్‌ (32) జ్వరంతో బాధపడుతూ ఆదివారం మృతిచెందాడు. శనివారం ఇదే గ్రామానికి చెందిన పూజ (18) జ్వరంతో మృతి చెందింది.


  • 5 నెలల్లో 2,847 డెంగీ కేసులు

రాష్ట్రంలో ప్రధానంగా డెంగీ కోరలు చాస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నుంచి ఆగస్టు 4 వరకు మొత్తం 2,847 డెంగీ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 1101, ఖమ్మంలో 287, మేడ్చల్‌లో 268, సూర్యాపేటలో 217 డెంగీ కేసులొచ్చాయి. జూలై 15వ తేదీ నాటికి 6,500 టైఫాయిడ్‌ కేసులు, 31,124 గ్యాస్ట్రోఎంటెరిటిస్‌ కేసులు, 140 మలేరియా కేసులు నమోదయ్యాయి. డెంగీ, మలేరియా మరణాలను వైద్య ఆరోగ్యశాఖ లెక్కల్లో చూపడం లేదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వచ్చే కేసులు, మరణాలు కూడా అసలు లెక్కల్లోకే రావడం లేదనే ఆరోపణలున్నాయి. అవి కూడా కలిపితే కేసుల సంఖ్య రెట్టింపు ఉంటుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Aug 12 , 2024 | 09:33 AM

Advertising
Advertising
<