ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Job Calendar: జాబ్‌ క్యాలెండర్‌ వచ్చింది..

ABN, Publish Date - Aug 03 , 2024 | 04:27 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎప్పుడెప్పుడా అని నిరుద్యోగులు ఎదురుచూసిన జాబ్‌ క్యాలెండర్‌ను ఎట్టకేలకు అసెంబ్లీ వేదికగా శుక్రవారం విడుదల చేసింది.

  • 2025 ఆగస్టు వరకు నియామక పరీక్షల వివరాలు

  • అసెంబ్లీలో విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. అక్టోబరులో గ్రూప్‌-1 మెయిన్స్‌, మరో నోటిఫికేషన్‌ జారీ

  • నవంబరు, ఏప్రిల్‌లో టెట్‌, ఫిబ్రవరిలో డీఎస్సీ.. ఏప్రిల్‌లో ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు

కొత్తగా 13,505 ఉద్యోగాల భర్తీకి అనుమతులు

హైదరాబాద్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎప్పుడెప్పుడా అని నిరుద్యోగులు ఎదురుచూసిన జాబ్‌ క్యాలెండర్‌ను ఎట్టకేలకు అసెంబ్లీ వేదికగా శుక్రవారం విడుదల చేసింది. వచ్చే ఏడాది ఆగస్టులోపు ఏయే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు వెలువడతాయి, ఆయా ఉద్యోగాల భర్తీకి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తురు అనే సమాచారంతో క్యాలెండర్‌ను ఇచ్చింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విడుదల చేసిన ఈ జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా ప్రభుత్వం గ్రూప్‌-1 అభ్యర్థులకు తీపికబురు చెప్పింది. జాబ్‌ క్యాలెండర్‌లో పేర్కొన్న ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ అయిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించిన మెయిన్స్‌ పరీక్షలను అక్టోబరులో నిర్వహిస్తారు.


అలాగే, అక్టోబరు నెలలో మరికొన్ని గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసి 2025 ఫిబ్రవరిలో ప్రిలిమ్స్‌, జూలైలో మెయిన్స్‌ నిర్వహిస్తారు. అలాగే, డిసెంబరులో గ్రూప్‌-2 పరీక్షలు జరగనున్నాయి. ఇక, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి నవంబరు, 2025 ఏప్రిల్‌లో టెట్‌ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అలాగే, ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఇక, ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ఏప్రిల్‌లో నోటిఫికేషన్లు జారీ చేసి ఆగస్టు నెలలో అర్హత పరీక్షలు నిర్వహించనున్నారు. వీటితోపాటు గ్రూప్‌-3 సర్వీసులు, వైద్య శాఖ, విద్యుత్‌, ఇంజనీరింగ్‌ విభాగాల్లో కొలువుల భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఈ జాబ్‌ క్యాలెండర్‌లో ఆయా విభాగాల్లో భర్తీ చేయనున్న పోస్టుల సంఖ్యను ప్రకటించలేదు. జాబ్‌ క్యాలెండర్‌కు చట్టబద్ధత కల్పించాలని భావించినా.. ప్రభుత్వం ప్రకటనకే పరిమితమైంది.


  • నిరుద్యోగులకిచ్చిన హామీ నెరవేరుస్తాం

నిరుద్యోగులకు ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోటుపాట్లను గుర్తించి, అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకుని జాబ్‌ క్యాలెండర్‌ రూపొందించామని పేర్కొన్నారు. ఈ మేరకు శాసనసభలో మాట్లాడిన మంత్రి భట్టి.. గత ప్రభుత్వ హయాంలో పేపరు లీకేజీలతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే టీజీపీఎస్సీకి కొత్త చైర్మన్‌ను నియమించడంతోపాటు బోర్డులో సంస్కరణలు అమలు చేశామని చెప్పారు. యూపీఎస్సీ, కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అనుసరిస్తున్న పద్ధతులు, విధానాలను అర్థం చేసుకునేందుకు సీనియర్‌ ఐఏఎ్‌సలతో రెండు కమిటీలను వేసి వారి సూచనలు అమలు చేశామని గుర్తు చేశారు.


పాత గ్రూప్‌-1 రద్దు చేసి 60 పోస్టులు జత చేసి 563 ఖాళీలతో కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసి ప్రిలిమ్స్‌ నిర్వహించడమే కాక ఫలితాలు కూడా ప్రకటించామన్నారు. అక్టోబరు-21-27 వరకు మెయిన్స్‌ కూడా నిర్వహిస్తున్నామని వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప వ్యవధిలోనే 32,410 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అదనంగా 13,505 ఉద్యోగ ఖాళీల భర్తీకి అనుమతులు కూడా ఇచ్చామన్నారు. 11,062 ఖాళీలతో ఉపాధ్యాయ నియామకాలకు డీఎస్సీ ప్రకటించామని తెలిపారు. 435 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో 45 పోస్టులను నియమించబోతున్నామని భట్టి తెలిపారు.


నోటిఫికేషన్‌ పేరు పోస్టు పేరు నోటిఫికేషన్‌ జారీ పరీక్ష ఏజెన్సీ

గ్రూప్‌-1 మెయిన్స్‌ గ్రూప్‌-1 2024 ఫిబ్రవరి 2024 అక్టోబరు టీజీపీఎస్సీ

గ్రూప్‌-3 సర్వీసెస్‌ గ్రూప్‌-3 2022 డిసెంబరు 2024 నవంబరు టీజీపీఎస్సీ

ల్యాబ్‌ టెక్నిషియన్స్‌ ల్యాబ్‌ టెక్నిషియన్స్‌

నర్సింగ్‌ ఆఫీసర్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌

ఫార్మసిస్ట్‌ ఫార్మసిస్ట్‌ 2024 సెప్టెంబరు 2024 నవంబరు ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ

గ్రూప్‌ు-2 సర్వీసెస్‌ గ్రూప్‌-2 2022 డిసెంబరు 2024 డిసెంబరు టీజీపీఎస్సీ

ట్రాన్స్‌కోలో ఇంజనీర్లు ఏఈఈ 2024 అక్టోబరు 2025 జనవరి ట్రాన్స్‌కో

గెజిటెడ్‌ కేటగిరి -

ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఏఈఈ 2024 అక్టోబరు 2025 జనవరి టీజీపీఎస్సీ

టెట్‌ టీచర్‌ 2024 నవంబరు 2025 జనవరి స్కూల్‌ ఎడ్యుకేషన్‌

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ గ్రూప్‌-1 2024 అక్టోబరు 2025 ఫిబ్రవరి టీజీపీఎస్సీ

గెజిటెడ్‌ స్కేల్‌ సర్వీసెస్‌ అన్ని విభాగాలు 2025 జనవరి 2025 ఏప్రిల్‌ టీజీపీఎస్సీ

డీఎస్సీ టీచర్లు 2025 ఫిబ్రవరి 2025 ఏప్రిల్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌

ఫారెస్ట్‌ విభాగం బీట్‌ ఆఫీసర్లు 2025 ఫిబ్రవరి 2025 మే టీజీపీఎస్సీ

టెట్‌ టీచర్లు 2025 ఏప్రిల్‌ 2025 జూన్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌

గ్రూపు-1 మెయిన్స్‌ గ్రూపు-1 -- 2025 జులై టిజిపిఎస్‌సి

పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ 2025 ఏప్రిల్‌ 2025 ఆగస్టు టీజీపీఆర్‌బీ

పోలీస్‌ కానిస్టేబుల్‌ 2025 ఏప్రిల్‌ 2025 ఆగస్టు టీజీపీఆర్‌బీ

Updated Date - Aug 03 , 2024 | 04:27 AM

Advertising
Advertising
<