ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS Mlc Polls: 27న ఎమ్మెల్సీ పోలింగ్.. బరిలో ఉన్నది వీరే..?

ABN, Publish Date - May 25 , 2024 | 05:59 PM

ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈ నెల 27వ తేదీ సోమవారం జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మూడు జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటింగ్ జరగనుంది. ఇక్కడి నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందిన సంగతి తెలిసిందే.

Graduate Mlc Polling

హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈ నెల 27వ తేదీ సోమవారం జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మూడు జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటింగ్ జరగనుంది. ఇక్కడి నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ అసెంబ్లీ నుంచి రాజేశ్వర్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. దాంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దాంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి 27వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది.


గ్రాడ్యుయేట్ బై పోల్ బరిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులతో కలిపి మొత్తం 52 మంది బరిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. తర్వాత ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు ఉందని ఆనలిస్టులు విశ్లేషిస్తున్నారు. జూన్ 5వ తేదీన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై పోల్ రిజల్ట్ రానుంది.



Read Latest
Telangana News and Telugu News

Updated Date - May 25 , 2024 | 05:59 PM

Advertising
Advertising