Hyderabad: గూప్-4 పోస్టుల భర్తీ..
ABN, Publish Date - Jun 10 , 2024 | 05:31 AM
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించిన కసరత్తును తుది దశకు తెచ్చింది. ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నట్టు ప్రకటించింది.
13 నుంచి వెబ్ ఆప్షన్లు
హైదరాబాద్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించిన కసరత్తును తుది దశకు తెచ్చింది. ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నట్టు ప్రకటించింది. మెరిట్ జాబితా ప్రకారం ఒక్కో పోస్టుకు ముగ్గురి చొప్పున సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయనున్నట్టు ఇది వరకే ప్రకటించింది. అయితే తొలుత వెబ్ ఆప్షన్లు తీసుకుని సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. అభ్యర్థులు వెరిఫికేషన్‌కు ఏయే సర్టిఫికెట్లు తీసుకురావాలనే చెక్‌లి్‌స్టను వెబ్ నోట్‌లో, వెబ్‌సైట్‌లో పొందుపరచినట్టు వివరించింది.
టీజీపీఎస్సీ కార్యాలయంతోపాటు పబ్లిక్ గార్డెన్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపడతామని వెల్లడించింది. వెబ్ ఆప్షన్ లింక్ ఈ నెల 13 నుంచి టీ జీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
Updated Date - Jun 10 , 2024 | 05:32 AM