Police Awards: హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పతకం
ABN, Publish Date - Aug 15 , 2024 | 02:41 AM
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం బుధవారం దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర బలగాలకు చెందిన 1,037 మంది పోలీసు సిబ్బందికి పతకాలను ప్రకటించింది.
నేరగాళ్లతో ప్రాణాలకు తెగించి పోరాడిన సాహసానికి గుర్తింపు
రాష్ట్రం నుంచి మరో ఏడుగురికి గ్యాలంటరీ పతకాలు
దేశవ్యాప్తంగా 1,037 మందికి పోలీసు పతకాలు
న్యూఢిల్లీ, హైదరాబాద్ సిటీ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం బుధవారం దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర బలగాలకు చెందిన 1,037 మంది పోలీసు సిబ్బందికి పతకాలను ప్రకటించింది. ఇందులో తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు అత్యంత ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి శౌర్య (గ్యాలంటరీ) పతకాన్ని ప్రకటించారు. ఈసారి ఈ పురస్కారానికి ఎంపికైన ఏకైక వ్యక్తి ఈయనే కావడం విశేషం. గొలుసు దొంగతనాలతోపాటు ఆయుధాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు ఘరానా నేరగాళ్లను ప్రాణాలకు తెగించి పట్టుకున్నందుకు మాదాపూర్ సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్యను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.
కర్ణాటకకు చెందిన కరుడుగట్టిన నేరగాళ్లు ఇషాన్ నిరంజన్, రాహుల్‌లు హైదరాబాద్‌లో 2022 జూలై 25న మహిళ మెడలో నుంచి చెయిన్ దొంగిలించారు. కేసు దర్యాప్తులో భాగంగా హెడ్ కానిస్టేబుల్ యాదయ్య సీసీ ఫుటేజ్‌ల ద్వారా నిందితులను గుర్తించారు. బొల్లారం క్రాస్‌రోడ్ వద్ద నిందితులను పట్టుకునేందుకు యాదయ్య మరో ఇద్దరు కానిస్టేబుళ్లు రవి, దేబా్‌షతో కలిసి ప్రయత్నించాడు. ఈ సమయంలో దుండగులు కత్తులతో దాడికి తెగబడ్డారు. యాదయ్య ఛాతి, వీపు, కడుపు, చేతిపై పలుమార్లు కత్తులతో పొడిచినా వెరవకుండా ఇతర కానిస్టేబుళ్లతో కలిసి నిందితులను పట్టుకున్నారు. తీవ్రంగాయాల పాలైన యాదయ్య 17 రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందారు.
దుండగులను పట్టుకోవడంలో ఆయన చూపిన ధైర్యసాహసాలకు గాను అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంటరీ పతకాన్ని ఆయనకు ప్రకటించారు. పతకం సాధించిన యాదయ్యను డీజీపీ జితేందర్, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి అభినందించి సత్కరించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. 214 మందికి శౌర్య పతకాలు అందించనున్నారు. ఇందులో ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ గ్యాలంటరీ (పీఎంజీ)తోపాటు 213 మెడల్ ఫర్ గ్యాలంటరీ (జీఎం) ఉన్నాయి.
94 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 729 మందికి మెరిటోరియస్ సేవా పతకాలు ప్రకటించారు. సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎ్‌ఫ)కు గరిష్ఠంగా 52 శౌర్య పతకాలు, జమ్మూకశ్మీర్ పోలీసులకు 31, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర పోలీసు సిబ్బందికి 17 చొప్పున, ఛత్తీ్‌సగఢ్ నుంచి 15 మందికి, మధ్యప్రదేశ్ నుంచి 12 మందికి ఈ పతకాలు దక్కాయి.
తెలంగాణ నుంచి ఏడుగురికి గ్యాలంటరీ పతకాలు లభించగా, ఇద్దరికి విశిష్ఠ సేవా పతకాలు, 11 మందికి ప్రతిభా సేవా పతకాలు దక్కాయి. ఫైర్ సర్వీ్‌సలో తెలంగాణ నుంచి ఒకరికి విశిష్ట సేవా పతకం, ఇద్దరికి ప్రతిభా సేవా పతకాలు లభించాయి.
గ్యాలంటరీ పతకాలు లభించిన వారు
సునీల్ దత్, ఐపీఎస్ - ఎస్పీ
మోరా కుమార్ - డిప్యూటీ అసాల్ట్ కమాండర్
శనిగరపు సంతోష్ - అసిస్టెంట్ అసాల్ట్ కమాండర్
జూనియర్ కమాండోలు అమిలి సురేశ్, వెలుముల వంశీ, కంపాటి ఉపేందర్, పాయం రమేశ్
రాష్ట్రపతి విశిష్ట సేవా
పతకాలు లభించినవారు
సంజయ్ కుమార్ జైన్, అదనపు డైరెక్టర్ జనరల్
కటకం మురళీధర్, డీసీపీ
వెంకటేశ్వర్లు కందిమళ్ల, పైర్ సర్వీసులో డ్రైవర్ ఆపరేటర్
ప్రతిభా సేవా పతకాలు పొందిన వారు
అవినాష్ మహంతీ - కమిషనర్ ఆఫ్ పోలీస్
సయ్యద్ జమీల్ బాషా- కమాండెంట్
పి. కృష్ణ మూర్తి- అదనపు ఎస్పీ
సబ్ ఇన్‌స్పెక్టర్లు : కొమరబత్తిని రాము, అబ్దుల్ రఫీఖ్, ఇక్రం ఏబీ ఖాన్, శ్రీనివాస్ మిశ్రా, కుంచల బాలకాశయ్య
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు: ఎ.లక్ష్మయ్య, గుంటి వెంకటేశ్వర్లు
ఇన్‌స్పెక్టర్: నూతల పాటి జ్ఞాన సుందరి
పైర్ సర్వీసులో ప్రతిభా సేవా పతకాలు
లీడింగ్ ఫైర్‌మెన్‌లు మాధవరావు తెలుగు, వహీదుద్దీన్ మహమ్మద్
హోంగార్డ్, సివిల్ డిఫెన్స్‌లో
ప్రతిభా సేవా పతకాలు
మహిళా హోంగార్డులు : లక్ష్మీ బండోళ్ల, కవితా ఇంటూరి, సుమలతా ఇనుముల, మల్లేశ్ మేడిపల్లి, గాలయ్య నామాల
Updated Date - Aug 15 , 2024 | 02:41 AM